పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

గ్రామ కైఫియత్తులు


రాలేక వుండిరి గనుకను యీకృష్ణానదియంత చిన్నవారలకు వోరివారికి మోకాటీలోతునను దారియిచ్చె గనుకను దాటివచ్చి యీప్రతాపరుద్రుని దర్శనం చేశిరి. గనుక వారికి దయచేశ యీకొండవీటికిందను చెల్లేశీమలు౧౪కిను లోను వారికి వుపాధిచేశాను, వారు నిల్చిరి.యీకొండవీడు, వినుకొండ, బెల్లంకొండలు ఆనాడు వెలనాడు అందురు. గనుకను యీశీమనున్నవారికి వెలనాటివారు అనిరి. ఆరువేలయిండ్లవారు గనుకను ఆరువేలవారు అనిరి. నాడు అనంగ్గాను భూమి గనుక వెలనాడు అనిరి. పలెనాడు, పాకనాడు, ములినాడు, కాసరినాడు, వేగినాడు. వెలగలనాడు. వెసిరవాయి. యివిశీమల పేర్లు. నంవంద్ద వూరిపేరు. యీశీమనుంచి వచ్చినవారు వారివారి నెలవునను యేశీమనుంచి వచ్చినవారు ఆసీమవారితో బాంధవ్యాలు చేస్తూవచ్చిరి గనుకను ఆశీమల పేర్లు పిల్చినారు గనుకను ఆశీమల పేర్లను నామాంకితాలు అయినవి. గ్రామంవక్కటే గనుకను నంద్దవరీకులు అనిరి. నడువడ్లు యెక్కువ తక్కువ మాత్రమే కానీ బ్రాహ్మణ్యం అంతా వక్క విధంగాని రెండు విధాల లేవు. యీప్రతాపరుద్రుడు యెనభై యెనిమిది సంవత్సరములు యేలెను. కలి సంవ్వత్సరంబులు ౩౬౦౦ యేండ్లమీదటను దుందుభి సంవత్సరమందునను పట్టుబడెను. యీప్రతాపరుద్రుడు చనినపింమ్మటను ద్వాదశ వర్షక్షామం ఆయను. రాజ్యప్రతిపాలనలు లేకపోయను. ప్రజలు కొందరు దేశాంత్తరులు అయినారు. (యెరుక ఉండవలెనని వ్రాసినాను. యిది యీప్రతాపరుద్రుడి యేలుబడి).

గజపతివారి యేలుబడి వృత్తాంతము:-

వీరి యింటిపేరు మిరియాలవారు అందురు. వడ్డెరాజులు యీగజపతి నామాంకితము .విశ్వంభరుడు ప్రజలుడయి ద్వాదశ వర్షంబులు యేలెను. ప్రజల్కు పాలనంచేశెను. గనుక దేశం సుభిక్షం ఆయను. యీవిశ్వంభరుని కుమార్లు గణపతిదేవు, నరపతిదేవు, విశ్వంభరదేవు, బాలభాస్కర దేవు, వీరు నలుగురు కుమారులు. గజపత్యాశ్వయులు. వీరేపరాక్రమములు. అఖిలదిర్భితకీర్తి విశాలురు జగనల్పు గుండ్లగుండ్ల బిరుదులున్నూ, యీగజపత్యాన్వయులున్నూ శ్రీ మహామండలేశ్వరులయి యేలేశ్వరం పడమటికిహద్దుగాను యేలుచుండి యీ కొండవీటిశీమ మూలు౧౮శీమలు యీగజపతివారు యేలుచూ వుండి యీకొండవీటి శీమలోను బ్రాంహ్మణులకు వృత్తిక్షేత్ర అగ్రహారాలు యిచ్చిన్ని.

శ్లొ౹౹ గణపత్యాంన్వయా భూపో గుణపత్వపనీశ్వర :
బ్రాంహ్మణీభ్యశ్చ తుశ్చాత్మ్వా వింశజ్ఞానపదాందదౌ
శ్రీమాంశాకాబ్దే రసబాణ ఖేందో: సంఖ్యాప్నవృత్యా ద్విజపుంగవేభ్యః ౹
గ్రామందదౌ శ్రీగణపత్యభిఖ్యా వ్యక్తిప్రయుక్తా౯ గణపత్యధీశః ౹౹

శ్రీస్వస్తి శ్రీమత్త్రిభువన చక్రవర్తి శ్రీ మద్రాజాధిరాజదేవత జయరాజ్య సంవత్సరంబులు ౧౦౫౬ అగునేటి ప్రమాదీచనాను సంవత్సర మందునను వృత్తి క్షేత్రాలు గ్రామాదులు యిచ్చెను. శ్రీగ్రామాదులు శ్రీతెనాలి ౧ , చివ్వలూరు ౧ , కొల్లిపర ౧, మున్నంగి ౧ వెల్లటూరు ౧, అంతుమూడి ౧, వోలేరు ౧, అనంత్తవరం ౧, నల్లూరు, కామరాజుగడ్డ ౧, అంగలకుదురు ౧, మాంచాళ ౧, నందంపల్లి , పెదచరకూరు ౧, ధరణికోట ౧, చరుకు పల్లి ౧, తొప్పెలపూడి ౧, దావులూరు ౧, దోనేపూడి ౧,పెదకాకాణి ౧, పాలడుగు ౧, తూర్పు