పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

25


మెచ్చెను. జయినులు యదార్ధం పలికినారు గనుక వారినేమనకరాజు వూరక వుండెను. బ్రాహ్మణులు చేశిన కృత్మిమోపాయము జయినులకు తేటపడేను యీబాహ్మణులు, జయినులను అబద్దీకులను జేశిరి. జయినులు యదార్ధం చెప్పిరి. అందరూరకవుండి విమర్శించక పోయినందున బ్రాహ్మణులు జయినులు చేశినగ్రంధాలను అన్నిటినీ అగ్నిహాత్రంలో దగ్ధం చేశెనూ. రాజు చూస్తూవుండెను. ప్రతిపాలన చాయడాయను గనుకను జయినులు తాముచేశ్ని గ్రంధాలు యీ బ్రాంహ్మణులు దగ్ధంచేయగాను యీప్రతాపరుద్రుడు ప్రతిపాలన శాయడాయను గ్రంధాలు మనం చూడగా దగ్ధంచేశిరి. మనము హీనులమయి వుండవలశినది. రాజు కులక్షయం చేయిస్తూ వున్నాము అంన్నాడు. రేపు ఆయినా యీబ్రాహ్మణులు రాజుతోనూ చెప్పి మనము సఖలంచేయించే వారు. యీబ్రాంహ్మణులు కృతిృమం చేస్తే రాజు ప్రతిపాలన లేదాయెను. మనము హీనులమై వుండలేము. మనము శరీరాలు చాలింతాము అని విచారించి జయినులు బ్రాహ్మణులను మీరు చదివే మాత్రమేకానీ వేదశాస్త్రాలు మీయందు నిపుణతలేకపోగాక మేము కాపురాలు చేసిన పాళ్ల మీదను యెవరూ కాపురాలుజేసినా జేయలేకపోగాక మంమ్ము యీకృత్యము విచారించిన వారిలోను కల్పన మంత్రబన్నని సంతతి యీ మంత్రాలు అభ్యశించినవాండ్లు భిక్షకులు అవుదురు గాక యీరాజు బహుజనపోషకుడు యీబ్రాంహ్మణులు చేశ్ని కృతిృమం ప్రతిపాలన శేయక పోయినందున యిధరణికోట స్థలం విడుచుగాక, పరరాజులకు పట్టుబడుగాక, మాకులంవారు మంమ్ముని కలశిరాక ప్రాణభీతిని పోయినారు, హీనులై పోదురుగాక అని శేపించి బ్రాంహ్మణులను మాగ్రంధాలను దగ్ధం చేస్తిరి. మీకు ముందురను మాగ్రంధాలు లేకపోను, ఆదర్వులేదు. యీగ్రంధం ప్రయోజనాలకు యిది అమరం వుంచుకోమని చాతులక్షగ్రంధం అమరు యిచ్చి జయినులు అందరు విషాంన్నభుక్తులై తర్లిరి. యీజయినులు మన్నుదిబ్బలుపోశి ఆదిబ్బలమీదను గృహాలుకట్టి కాపురాలు చేశేటివారు. వారు కాపురాలు చేశేటి గ్రామమధ్యమందునను సూర్యనారాయణ అనే దేవుండు గ్రామానకు పశ్చిమభాగమందున జట్లంమ్మా అనేశక్తి గ్రామానకు పూర్వభాగమందునను దేశమ్మ అనే శక్తియీ-దేవుళ్లను కొల్చేది. యీపాళ్లమీదను కాపురాలు. చేశేవారికి జయంలేదు రాజు ప్రతీపానలులేవు. యీప్రతాపరుద్రులు దనుకారాజులు, ధర్మప్రతిపాలనులు చేశి యేలినారు గనుకను ఆయువులు మిక్కిలి ఆయురాజ్యధర్మం ప్రతి పాలన చేసినారు. యీ ప్రతాపరుద్రుడి యేలుబడినుంచి ధర్మప్రతిపాలనలు సిద్ధించెను యీచొప్పన జయినుల ఫలం యొక్క వుండవలెనని వాసినారు. ప్రతాపరుద్రుడు కాశిలోను బ్రాహ్మణులకు ధారావంత్తం బ్రాహ్మణులకు యిచ్చుట యీజనంఖిలమయిన వెనుకను ధరణికోటలోను వుండగాను యీబ్రాంహ్మణులు అంనట్టి మరి నాలుగు యేండ్లకు కాశీరాజ్యంకు అవాంత్తరం వచ్చి క్షామం తగిలెగనుకను రాజ్యం విడిచి బ్రాంహ్మలు ముక్కంట్టియేలే రాజ్యానకు పోతేను ఆనాడు వచ్చిన కుంగంగలోను అన్నమాట నడిపించిరి అని ఆరాజ్యం బ్రాంహ్మణులు వచ్చి ఆతుకూరిలోను దిగిరి గనుకను కృష్ణానది నిండా సంపూర్ణవుదకముతోవుండి, వుండేగనుక ను ధరణికోటకు దాటను అలవిగాదాయను ముక్కంటికి చెప్పినారు. దాటించ్చేవారు లేకుండిరి యీబ్రాహ్మంణులను విచారించి ఆరాజ్యం విడిచి యింతతడవు వచ్చి అన్నంలేకను యిక్కడ మృతిజేందేటి కంటెను కృష్ణానదిలోను స్త్రీ బాలులతోను చొత్తాము మనకు పాపాలు పరిహారం పతితపోవని అని తెంపుచేశి కృష్ణానదిలోకి ఆరువేల కుటుంబాలు వారు జొచ్చిరి. తక్కినవారు ప్రాణభీతిని