పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

గ్రామ కైఫియత్తులు


ధరణికోట ప్రవేశించ్చి యప్పంట్టివలెనే వుండ్డిరి. యోగవాగాలు అంత్తట్టినుంచ్చి పనిగొన వాయెను. యోగవాగాలు పనిగొనకపోయినండ్డున యీప్రతాపరుద్రుడు చింతించ్చి త్తనమర్మం యవ్వరూ యెరుగనిదయి అంబ్బికాదేవికి యేలాగున యెరుకపడేనో జయనులే చెప్పి వుండ్డేరు. అని మనస్సంద్దు నమతగిలి అంబ్బికాదేవి జయినుల మీదపక్షం అని విచారించ్చి అంబ్బికా దేవితోను మనము జయినులేఅని దొడ్డబ్రాంహ్మణులు అనుకుంద్దురు. యీబ్రాంహ్మణులకన్నా కాశిబ్రాహ్మణులు యంత్తదొడ్డవారలు వీరు ఆశీర్వచనంచ్చేశి యోగవాగాలు నడిపించ్చిరి. యికను మీకు యీ యోగవాగాలు పనిగొనవు అనిరి. అలాగుననే పనిగొనవాయెను. యీబ్రా హ్మణులే దొడ్డవారు. యీబ్రాంహ్మణుల నాటివారలుకారు జయినులు అని యెరుగను అంబ్బికాదేవంమ్మ జయినులే దొడ్డవారలు సత్యవాదులు యెన్నో అనాగత హేష్యసంగతులు చెప్పేటివారలు అని ప్రతిమాటలు యిచ్చె గస్కును యీ ప్రతాపరుద్రుడు జయినుల దొడ్డతనము యీ బ్రాహ్మణుల దొడ్డతనము దిట్టపరచవలెను అని కోపోద్దీపితుండై వరుకు యెవరికీ లేకుండా వక క్రూర సర్పాంన్ని తెప్పించి ఒక మంద్షసములో వుంచి తాను కొల్వుతీర్చి ఆమంద్దసం సభామధ్యమందున వుంచ్చి జయినులను బ్రాహ్మణులను వుభయత్రల వారిని పిలిపించి మీరు యీవుభయత్రులలోకి యవ్వరు దొడ్డవారలు మీతారతమ్యములు విచారించ వలసినది. యీమందసములో వుంన్న 'వస్తువ యదార్ధముగా యవ్వరు చెప్పితేవారు దొడ్డ బ్రాంహ్మణులు, చెప్పలేనివారిని కులక్షయం చేయిస్తూ వుంన్నాము అని ప్రతాపరుద్రుడు పంతబడిచేశె గనుక జయినులు అడిగినప్పుడే యీమందసములో యేవస్తువులేదు క్రూరసర్పం వున్నదని చెప్పిరి గనుకను ముక్కంటి యేమీ అనక వూరికె వుండేను. ఈ బ్రాంహ్మణులు మేము రేపుచెప్పేము అనిరి వుభయత్రలు వారివారి గృహాలకు పోయి యీబ్రాంహ్మణులు విచారించి జయినులుచేశ్ని గ్రంధాలు వారిమాటలు యదార్ధం వీరు చెప్పినమాటలు మనము చెప్పలేము. రాజు యవ్వరు చెప్పలేకపోతే వారిగ్రంధాలు అంన్ని దగ్ధం చేయిస్తుంన్నాను, వారిని భూమిన లేకుండాను, క్షయంచేయిస్తూవుంన్నాను అని పంతం పలికెను. జయినులు యీమందసమందు సర్పం వుంన్నదనిచెప్పిరి. యీజయినులు మాటయదార్ధం చెప్పేటివారు. జయినులు చెప్పినమాటమనము చెప్పరాదు మనమాటే గెల్పించుకొని యీజయినులను గ్రంధాలు అంన్నీ అగ్ని దగ్ధం చేయించి జయిన సంహ్రరమే చేయించవలెనని కృత్యము విచా రించి యీబ్రాంహ్మణులు మంత్రజ్ఞుంణ్ని మాట్లాడి వాడికి అంన్నవస్త్రాలు నడపించే అట్టుగాను కట్టడచేశిరి వాడు వచ్చి కొరందొరు ఆశీర్వచనంచేశి యీమందసములో ముత్యాల భత్రం ఉన్నది అని మీరు మంత్రాక్షింతలు వెయ్యండి మీసందడి నేను అక్షింతలు మంత్రించి ఓక ముత్యాల భత్రం వుండచేశి మిమ్మును గెల్పిస్తున్నాము అని అనెగనుక వాణ్ని బ్రాంహ్మణులు తమ వేషం ధరియించి వానికి యజ్ఞోపవేతం చేసి బ్రాహ్మణులు వాణ్ణిత్తమలో కల్చుకొని వచ్చి ఆశీర్వచనంచేశి కూర్చుంనంత్తలోను జయినులువచ్చిరి. వుభయత్రల వారిని యీమందసములో వుంన్నవస్తువు చెప్పమనిరి గనుకను జయినులు నిన్ననే మేము సర్పం వుంన్నదని చెప్పిన్నాము అనిరి. యీబ్రాహ్మణులంతా ఆశ్వీరచనంచదివి యీమందసములోను ముత్యాలభత్రం వున్నదని మంత్రాక్షతలు వేశిరి. ఆమంత్య్రజ్ఞుడు తన విద్వాంసత్వాన ముత్యాల భత్రం చేసెను. బ్మాంహ్మణులను గెలిపించెను. గనుక రాజు నేను సర్పాన్ని అందులో వుంస్తే జయినులు అయితే సర్పమే వున్నది అనిచెప్పిరి. యీబ్రాహ్మణులు ఆశీర్వచనం చదివి ముత్యాల భత్రం వున్నదంటే ముత్యాలభత్రం వుండెను. వీరు యెంతదొడ్డ బ్రాంహ్మణులు అని రాజు