పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

గ్రామ కైఫియత్తులు


యుధిష్ఠిరశకవర్షంబ్బులు విక్రమార్కుడు పుట్టినాడు.—— య్యకను విక్రమార్క శకవర్షంబులు నడిపించుకొనెను. ౨౦౦౦ సంవ్వత్సరములు నడిచెను. యీవరుకు విక్రమార్క యుధిష్ఠిర శక వర్షాలు ౩౧౮౦ నడిచెను. యిటు తర్వాతను శాలివాహనుడు పుట్టి విక్రమార్కుంణ్ని గొట్టివేశి శాలివాహన శకవర్షంబ్బులు నడిపించ్చుకొని పంచవింశతివర్షంబ్బులు యేలి పరలోకగతుడాయెను. యీశాలివాహనశక పరుషంబ్బులు ధర్మప్రతిపాలనచేశి చినుకుతులా మెత్తగాను యింద్రకీలాద్రి కనకవర్షం కురిపించెను. అది మాధవవర్మ నిక్షేప ఆయెను. అటుతర్వాత కొట్టకేతు మహారాజు ౧౨౦ సంవత్సరంబ్బులు అటుతర్వాతను నీలకంఠమహారాజు ౧౩౦ సంవత్సరంబులు అటుతర్వాతను భోజమహారాజు ౧౨౪ సంవత్సరంబ్బులు అటుతర్వాతను యవనభోజుడు ౧౨౦ సంవ్వత్సరంబ్బులు యీ ఆరుగురు రాజులు ౭౨౭ సంవ్వత్సరంబులు ధర్మం నడిచి ఆటుతర్వాత ముక్కంటి అంద్దుదురు. యితనిని ఓరుగంటి ప్రతాప రుద్రుడందురు. యీముక్కంటి ౮౮ సంవ్వత్సరంబులు యేలెను. జయన సంహ్వారంబు చేశాను. దనకును ధర్మ పరిపాలనలు తప్పెను. కలిమి యిచ్చెను. అల్ప ఆయువులు వేదశాస్త్రాలు పాటించక నుండెను....(మును)లు శపించ్చిరి గన్కను వాక్యందులు తప్పెను. కలహించెను. అశ్వపతి, గజపతి, నరపతి రాజులు ముగ్గురురాజులు వేయివేలు సంవత్సరంబులు యేలగలవారలు. స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహనశకవర్షంబ్బులు ౮౩౬ అగు నేటి దుంద్దుతి సంవ్వత్సర మంద్దు యీ ప్రతాపరుద్రుడు పరరాజుచేతను పట్టుబడును. కలియుగ సంవ్వత్సరంబ్బులు నాలుగువేల పదహారు ముక్కంటి యేలి పొయ్యేవర్కు శాలివాహనశక వర్షంబ్బులు ౮౪౦ (9.8 AD) గ్కా చాకి ౧౬౦౮ అగు నేటి క్షయవరుకు ౯౯౭ కి యీవెన్కును యేలిన రాజులు రాజులేని రాష్ట్రం ౧౨ సంవ్వత్సరంబులున్ను ద్వాదశవర్ష క్షామము వెన్కు అశ్వపతులు గజపతులు నరపతులు యేలుబడి మధ్యదేశం తూర్పు గజపతిరాజ్యాలు ౧౮ దక్షిణ పశ్చిమ పుత్తరరాజ్యాలు నరపతులు ౧౮ అశ్వపతులు వుత్తర రాజ్యాలు ౧౮ కూడా రాజ్యాలు ౫౬ కిమధ్యదేశం ౩౯౯కి గజపతి వారు వీరిని మిర్యాలవారు అంద్దురు. వీరుంవుండే రాజులు జగదేవు జగపతి ౪౦ నారాయణ దేవు ౩౦ విశ్వంభరదేపు ౧౨ యితని కొమారుడు గణపతిదేవు ౫౮ యితని యేలుబడిని నియ్యోగులకు మిరాశీలు యిచ్చిరి. వీండ్లవారు అనుము కొండ్డ నుంచ్చి వచ్చిరి. పంట రెడ్లు వీరిని దొంతావారు అంద్దురు. యీగణపతివారి దేశం ఆక్రమించ్చిరి. యీదొంతా అల్లిరెడ్డి కుమారుడు పోలయ్య వేమన్న ౩౨ యిద్దరు. అంన్నవేమంన్న ౩౦ అంన్నవేమంన్న ౧౨ గొమరగిరి రెడ్డి ౧౪ కోమటి వేమంన్న గృహరాజు మేడ గట్టి౦చ్చి ౧౮ రాజు వేమన ౪—— యీరాజు వేమన్న పురిటిపంన్ను పోయిలపంన్ను శిశాలపంన్నులు కల్పించ్చి దుర్మార్గనడతలు నడచినంద్ను పొడచి చంపిరి. యితనిచావుతో నూరు సంవత్సరములు యేలిరి. యితనితో ఆర్గురు యేలిరి కుదురు నష్టించ్చెను. యిటుతర్వాత కృష్ణదేవరాయలు యేలుచూవుండ్డి రెడ్లు వారు గజపతివారి దేశం ఆక్రమించ్చి యేలిన దేశాలు తాను ఆక్రమించ్చి కనా౯టకం కిందకల్పుకొని కొండ్డవీడు కొండ్డపల్లెలు సాధించియేలెను. తిర్గి గజపతివారు మచిద గజపతి అని అతడు తిర్గి ఆక్రమించ్చి ౫౨ సంవ్వత్సరాలు యేలుచూ వుండగాను యీకృష్ణదేవరాయలుగారి గృహనామం సంపుటవారు అంద్దురు. శుంగొలవారు అందురు. యితడు దళంచేస్కుని కొండ్డవీడు కొండపల్లిలు సాధించ్చి గజపతివారి దేశం కొల్లబుచ్చి గజపతివారి మీదనూ ముట్టడి వేశినంత్తలో గజపతితన కూతురిని తమబిరుదులను యిచ్చిరి గన్కును శింహ్వాద్రి పొట్లూరి దగ్గరను శిలాస్తంభాలు నిల్ని గజపతి