పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

19


ధర్మం సడలెను. యిటుతర్వాతను ద్వాదశాబ్దంబులు క్షామం తగిలెను. యిటుతర్వాతను జనపతి విశ్వంభరుడు ద్వాదశవత్సరంబులు ప్రతిపాలన చేశి యేలెను.

పాండురాజు పరలోకగతుడయ్యే వర్కు ధర్మరాజుకు అయిన సంవత్సరంబులు ౧౭ అటుతర్వాతను శతశృంగపర్వతాననుంచి హస్తినాపురం వచ్చి కృపాచార్యులు, శిక్ష విద్యలు నాలుగు సంవత్సరంబులు (౪) అటుతర్వాతను కుంభసంభవుని దగ్గిర ధనుర్విద్యలు అయిదు సంవత్సరంబులు (౫) ఆటుతర్వాతను ధృతరాష్ట్రుని దగ్గిరను, యువరాజ్యంచేశి పదమూడు సంవత్సరంబులు వుండెను. అటుతర్వాతను కారణావతారంబున వకసంవత్సరం లక్కగృహం యంద్దు వుండెను. అటుతర్వాతను అయిదుసంవత్సరంబులు విప్రవేషానను యేకచక్రపురంబున వుండెను. అటుతర్వాతను వివాహంఅయి ద్రుపదరాజు యింటను వకసంవత్సరం వుండెను. ఆటుతర్వాతను తిరిగి అస్తినాపురంబున అయిదు సంవత్సరంబులు యువరాజ్యం చేశెను. అటు తర్వాతను యింద్రప్రస్థపురంబున యిరువై నాలుగు సంవత్సరములు తండ్రి భాగం రాజ్యంచేశి రాజసూయ యాగంచేశెను. అటుతర్వాతను వక సంవత్సరమునకు జూదంవాడెను. అటుతర్వాతను పంన్నెండు సంవత్సరములు ద్వయితమందు వుండెను. వనవాసము అటుతర్వాతను వక సంవత్సరం విరాటరాజు యింటను కంక్కుభట్టు నామం చాతను అజ్ఞాతవాసం చేతను వుండెను. ఆటుతర్వాతను ఖరనామసంవత్సర కార్తీకమాసమున కృష్ణ పక్షమున అమావాస్యను భారతయుద్ధం ఆయెను. భీష్ముడు పదిదినములు ద్రోణుడు ఆరుదినములు కర్ణుడు రెండు దినముల్కు శల్యుడు దుర్యోధనాధులు వకపగలు రాత్రి యుద్ధంచేశి మడిశి తదనంతరమందునను ౩౫ ముఫై అయిదు సంవత్సరములు యేకరాజ్యాభిషిక్తుడై రాజ్యంబు చేసెను. యితడు జననమయి ౧౨౫ యేండ్లు బ్రతికి ప్రభవ సంవత్సర చైత్ర శు ౧ నాడు ౧౩ ఘడియలమీదను పుణ్యం పాపలు పాపం మూడుపాళ్లు అయి కలియుగం నాలుగు లక్షలుంన్నూ ముప్పయి రెండ్డువేల యేండ్లున్నూ నడువవలెను గనుకను కలియుగ ప్రవేశం ఆయను అని పరిక్షిత్తును పట్టంగట్టి రాజ్యాభిషిక్తుంన్ని చేశి కృపాచార్యులను ప్రధానత్వం వుంచి యీధర్మరాజు స్వరాగమునుకై తంమ్ములు నలుగురు ద్రౌపదీ సమేతుండైత......అటుతర్వాతను పరీక్షిత్తు ౯౦ సంవత్సరములు కలి పురుషుంణ్ని కొట్టి ద్వాపరధర్మం నడిపి శృంగ్గి శాపంచేతను తక్షక దంష్ట్రమయి (Folio 4B) పరలోకగతుండాయెను. అటుతర్వాతను యీపరీక్షిత్తుకుమారుడు జనమేజయుడు 30 సంవ్వత్సరంబ్బులు చేశి ధర్మపాలనచేశి సర్పయాగం చ్చేశి పరలోకగతుడాయెను. యీ జనమేజయుని కుమాండ్లు శంఖ్క శతానీకులు అనేటివారు పదిసంవత్సరంబ్బులు యేలి ధర్మ ప్రతిపాలనలుచేశి పరలోకగతులయిరి. యీనలుగురు కలిగొట్టివేశి ద్వాపరధర్మం నడిపించ్చిరి. ౧౦౦ నూరు సంవత్సరంబ్బులు పాండుసం త్తతి నడిపించిరి. యిటు యిపుతల ధర్మప్రతిహలనం నడిపించ్చిరి ————దీర్ఘాయువులయి యేలిన రాజులు అంబ్బరీష మహారాజులు ౨౫౦ సంవత్సరంబ్బులు యేలెను. అటుతర్వాతను భల్లాణ మహారాజు ౧౮౪ సంవ్వత్సరములు యేలెను. ఆటుతర్వాతను శూద్రకమహారాజు ౧౮౨ సంవ్వత్సరంబులు యేలెను. అటుతర్వాతను విష్ణువద౯నుడు ౧౮౩ సంవత్సరంబులు యేలెను. అటుతర్వాతను చంద్రగుప్తమహారాజు ౧౮౧ సంవ్వత్సరంబులు యేలెను. తెనుగుబిజ్ఞడు ౧౦౦ నూరు సంవ్వత్సరంములు యేలెను. వీరు పద్దుకు ౧౧౮౦ సంవత్సరంబులు యుధిష్ఠిరశకవర్షంబులు నడిచెను. ద్వాపరమందును 3౫ సంవత్సరంబులు నడిచెను. యీ రెండ్డు యుగములను యుధిష్ఠిర శకవర్షంబులు ౧౨౧౫ నడిచెను. అటుతర్వాతను