పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

గ్రామ కై ఫియత్తులు


మానూరి వెంకంన్న పంత్తులుంగారి వంట్టులో వచ్చి నాదేండ్ల సముతు చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు వెంకంన్న పంత్తులుగారు ప్రభుత్వంచేస్తూవుండగా ఆధ౯త్తొందరను గురించి యేలూరు వగయిరా తొమ్మిది గ్రామాదులు ముఠా చేశి వాశిరెడ్డి పద్మనాభునిగార్కి విక్రయించిరి గన్కు పద్మనాభునిగారు, చంద్రమౌళినాయుడుగారు, పెదరామలింగంన్నగారు, నర్సంన్నగారు, సూరంన్నగారు, చ్ని నర్సంన్నగారు, చ్ని రామలింగంన్నగారు స్న౧౧౭౩ ఫసలీ (1763 A. D) వర్కు ప్రభుత్వంచేస్ని తర్వాతను జగయ్యగారు చినరామలింగన్నగారి తరుణమందు ప్రభుత్వాన్కు వచ్చి స్న౧౧౦౩ ఫసలీ (1763 A. D.) లగాయతు స్న౧౧౭౫ (1765 A. D.) వర్కు మూడు సంవ్వత్సరములు ప్రభుత్వం చేశెను.

తదనంతరం రామంన్న గారు స్న౧౧౭౬ ఫసలీ (1766 A. D.) లో ప్రభుత్వాన్కు వచ్చి సర్కారు జమీదారులయ్ని మాణిక్యారావువారి సావరాల నిమిత్తం గిట్టమి చేతను విస్తరించి కల్తను (కలతను) గురించి తమకు సహయ నిమిత్తమై అద్దంకి శీమ ప్రభువులయ్ని మందపాటి వారి సంస్తానములో సరదారులలో వుంన్నషువంటి కమ్మవారు బొల్లెపల్లి మేదర మెట్లవారు, నరహరిగారు, బత్తని శింగరప్పగారు, బత్తిని నర్సంన్నగారు, మేదరుమిట్ట గోపంన్నగారు, బొల్లెపల్లి తిరువెంగళప్పగారు, వీరు బహుక్షాత్రవంతులై యుందురు గన్కు పిలుపించుకొని వీర్కి సరదారీలుయిచ్చి యాభైమంది కమ్మవారితోటి తమకార్యక రామతుల్కు సహయం అయ్యేటట్టుగా నిన౯యించ్చి యీగ్రామంలో వుండ్డే తమస్తావరముంన్ను శిబ్బందివారి జీతాలకు గ్రామ కట్టుబడిగానుంన్ను యేప౯రచి వార్ని గ్రామములో కాపురంవుంచ్చి వారిసహయంవల్ల నుంచింన్ని, జయప్రదులయ్ని సదరహి ఫసలిలగాయతు స్న౧౧౯౨ ఫసలీ (1782 A. D.) వర్కు ప్రభుత్వంచేసి పయ్నివాన్ని ప్రకారం జర్గించినారు.

తదనంతరం రాజావెంక్కటాద్రి నాయుడుగారు స్న౧౧౯౩ (1783 A. D.)లో ప్రభుత్వాన్కువచ్చి పైని వ్యాస్ని కమ్మవారికి రామంన్నగారు నిన౯యించ్చి వసతులు మూడు సంవత్సరములు జర్గించి తదనంత్తరం జరిగించలేదు. స్న౦౨౦౭ ఫసలీ (1797 A. D.) లో (చిన) చ్చియోలూరి ముఠా గ్రామాదుల్కు తమతరుపు వ్యవహరస్తుడయ్ని కొలిపాక బ్రహ్మజీ పరంగా మజ్కురిలో వుండ్డే మల్లేశ్వరస్వామి వారికి పునః ప్రతిష్ట చేయించ్చి యీదేమునికి నిత్యనైవేద్య దీపారాధనల్కుకు ౧భూమిమాన్యం యిప్పించేవారు మరింన్ని గోపాల స్వామివారికింన్ని పునఃప్రతిష్ట చేయించ్చి నిత్య నైవేద్య దీపారాధనల్కుకు ౧భూమి యిప్పించ్చి ఉభయ దేవస్థానములకు కుచ్చెలు ౨యినాంయిప్పించ్చి ప్రభుత్వం చేస్తూవుండగా స్న౧౨౧౮ ఫసలీ (1808 A D.) లో గోపాలస్వామివారికి పయిని వాన్ని మేదరమిట్ట గోపన్నగారు గోపాలస్వామివారి ఆలయం శిథిలీకృతంగా వుండగా విప్పించి పునః కట్టించి స్వామివార్ని ప్రతిష్ట చేసినారు. స్న౧౨౨౧ ఫసలీ (1811 A. D.) వర్కు వెంక్కటాద్రి నాయుడుగారు ప్రభుత్వంచేస్తూ వుంన్నారు.

ది౨౮ఫిబ్రవరి అన ౧౮౧౨ సంవత్సరం.

మైక్రో ఫిల్ము రోలు నెంబరు: 1
మెకంజీ వాల్యూము : 1,
ఫోలియో : 29 R - 30.