పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

కొప్పర్రు

కై ఫియ్యత్తు మౌజే కొప్పర్రు సంతు నాదెండ్ల, ముటే

వేలూరు, తాలూకా చింత్తపల్లి ముత్తు౯జాంన్న గరు——

యీ గ్రామం పూర్వం నుంచ్చింన్ని కొప్పరు అనేపేరు ప్రసిద్ధిగా కల్గివుంన్నది. శాలివాహన శకం ప్రవేశమయిన తర్వాతను కొందరు రాజులు ప్రభుత్వము చెశ్ని తర్వాతను యీదేశాలకు అశ్వపతి నరపతి గజపతి అనేవి మూడు సింహ్వాసనాలు యేర్పడేగన్కు గజపతి సింహసనస్తుడైన గణపతి మహరాజులుంగారు శాలివాహనం ౧౦౫౬ శకం (1134 AD) మొదలుకొని ధర్మ వంత్తుడై రాజ్యం చేస్తూవుండ్డే యెడల వీరి దగ్గర మహప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శా ౧౦౬౭ శకం (1145 AD) అగునేటి రక్తాక్షినామ సంవ్వత్సర భాద్రపద బ ౩౦ అంగార్కవారం సూర్యగ్రహణకాలమంద్దు ప్రభువు దగ్గర దానంబట్టి బ్రాహ్మణులకు గ్రామకణి౯కపు మిరాశీలు నిన౯యించ్చే యడల యీ కొప్పర్రుకు యజుశ్శా ఖాధ్యయనులయిన కొపర్తివారి సంప్రతి ౧ పుణ్యమూర్తివారి సంప్రతి ౧ వెరశి యీ రెండు సంప్రతుల ఆరువేలనియ్యోగుల్కు. సమభాగములుగా మిరాశీ నిన౯యించ్చినారుగన్కు తదారభ్య యేతద్వంశుజులయ్ని వారు కణీ౯కం మిరాశీలో నుండియున్నారు.

పయ్ని వ్రాస్ని గణపతి మహారాజులుంగారి పుత్రులయిన కాకతి గణపతి వారుంన్ను అధికారం చేసి తర్వాతను వీరి పుత్రులయ్ని కాకతియ్య రుద్రదేవమహరాజులుంగారు శాలివాహనం ౧౦౬౦ శకం (1138 AD) మొదలుకొని ప్రభుత్వం చేస్తూవుండ్డే కాలమంద్దు యీస్థలాన్కు వుత్తరపాశ్వ౯ మంద్దు శివాలయం కట్టించ్చి మల్లేశ్వర స్వామివారనే లింగ మూత్తి౯ని ప్రతిష్ఠ చేసినారు.

తదనంత్తరం శా ౧౨౪౧ (1319 AD) లగాయతు రెడ్లు యీదేశములకు ప్రభుత్వానకువచ్చి కొండ్డవీడు మొదలయ్ని నిర్మాణం చేయించే కాలమంద్దు యీ స్తలంలో విష్ణుస్తలం లేకుండా వుండేగన్కు పయ్ని వాన్ని మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్కు దక్షిణం గ్రామ మధ్యమందు విష్నుస్తలం కట్టించ్చి యీదేవస్తానాల్కు విశేషమయిన వసతులు చేసి పుత్స వాదులు జరిగించేలాగున కట్టడం చేసినారు.

వడ్డే కర్ణాటక ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జర్గిన తర్వాతను దేశమునకు మొగలాయి ప్రభుత్వము వచ్చెగన్కు దేశముఖి, దేశపాండ్య, మొదలయ్ని బారాముత సద్ది హోదాలు నిన౯యించి సర్కారు సముతు బందిలుచేశేటప్పుడు యీగ్రామం నాదెండ్ల సముతులో దాఖలు చేసినారు గన్కు సముతు ఆమీలలో లేదు. దేశపాండ్యాల మూలంగ్గా బహుద్నిములు అమాని మామ్లయ్యతు జర్గించినారు.

స్న౧౧౨౨ ఫసలీ (1712 A. D.) కొండ్డవీటిశీమ మూడువంట్లుచేశి జమీదార్లకు పంచిపెట్టే యడల యీగ్రామం నాదెండ్ల సముతులో చేరినంద్ను సర్కారు మజుందార్లు అయ్ని