పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92 బిల్వమంగళ [అం 4

పోషించే భారము మాత్రము నీది.

చింతా - నాచేతిలో ఎర్రని ఏగాణి లేదు. బిచ్చమెత్తి పొట్టపోసుకోవలసి ఉంటుంది.

బిచ్చ - నన్ను పోషించు భారము నీది.

చింతా - నే నింటికిపోయి సొత్తు తెస్తానని తలచు తున్నావు కాబోలు! అట్లు జరుగనేరదు. నాసొత్తుకోసము నాకు విషము పెట్టడమునకు తత్తరపడినవాళ్ళకి దాని నిచ్చినాను. సొత్తెట్టివిషమో వా ళ్ళెరుగరు. తాళము చెవులు నేను పారవేయడము నీవు చూడలేదా?

బిచ్చ - చూచినాను. ఉండుండు. ఈమూట విప్పుతాను, ఈ యాభరణ మెవరిది?

చింతా - అదేమో?

బిచ్చ - చక్కగా చూడు - ఇది నీది-పోల్చుకోలేదా? - పిచ్చిదాని కివ్వలేదా?

చింతా - అది నీకెట్లు వచ్చింది?

బిచ్చ - దీనిని నేను దొంగిలించ నక్కరలేకుండానే ఆపిచ్చిది నాకిచ్చింది.

చింతా - అది నీది-నాదంటా వేమి?

బిచ్చ - ఇది నావద్దనుంటే నాకు జెయిలు తప్పదు. పిచ్చిదానినీ పిల్లవాళ్ళనూ మరపించుట సులభము.

చింతా - అందుకే అది నీది.

బిచ్చ - పిచ్చిది నాకు దీని నిచ్చింది కనుక ఇది నా