పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 2] బిల్వమంగళ 91

                              అంకురింపగజాల ♦ దనురాగ లతిక
                     స్వార్థాగ్ని శిఖలందు ♦ పాపసమిధలను
                              వేల్చి నన్దహియించు ♦ వేడ్క యెవ్వరికొ?
                     నను రాయిగా నెవ్వ ♦ రొనరించినారొ?
                              పతితపావన! దీన ♦ బంధు! దయాళు!
                     వేధించు నీమనో ♦ వేదనవల్ల
                              ప్రాణంబుపోయెడు ♦ త్రాణ నాకొసగి
                     హరియింపు మీవ్యధ ♦ అబలనే గాన.

(బిచ్చగాడు వచ్చును)

బిచ్చ - ఏమమ్మా ఒంటిగా కూర్చొని ఏమాలోచిస్తూన్నావు? ఇంటికి పోదామా?

చింతా - నీ వెవడవు?

బిచ్చ - నేను బిచ్చగాడిని-పిచ్చిది తాళము చెవులు నాకిచ్చింది-ఇంటికి రావలెనని నీకుంటే నేను కొనిపోతాను. అదేమి కొరకొరలాడుతూన్నావు ? నేను దొంగలాడడానికి నీవద్ద నేమీ లేదే?

చింతా - నే నింటికి రాను.

బిచ్చ - ఎక్కడికి పోదువు?

చింతా - కళ్లెక్కడి కీడిస్తే అక్కడికి.

బిచ్చ - నేను నిన్నెందు కడిగినానో ఆకారణము విను. నేను బృందావనము పోవలెనని నిశ్చయించుకొన్నాను. నీకు కూడా రావలెనని ఉంటే ఇద్దరమూ పోదాము. నన్ను