పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88 బిల్వమంగళ [అం 4

పోతాను. అందరు కృష్ణులూ ఒకటే - "ఏక మేవా ద్వితీయం బ్రహ్మ" - నీకు నీలాగూ, నాకు నాలాగూ తోచుతాడు... శఠులకు శఠుడు-లంపటులకు లంపటుడు-కపటులకు కపటి. నేను పోనా? పోనీ, కొంతసే వుండమన్నావు కనుక ఇక్కడే ఉంటాను.

చింతా - (స్వ) ఈమె యెవతయో కాని కేవలమూ పిచ్చిదానిలాగు కనబడలేదు. పైకి మాత్ర మలాగున్నది! సర్వస్వమూ విడిచిననేను ఈ మెను విడువలేనా ? బిల్వమంగళు డొక్కడే పోలేదా ? కృష్ణు డందరివాడని విన్నాను! ఈమె నింక నావద్ద నుండుమని నిర్బంధించను, ఏ మైనా కానీ. నా తలవ్రాత ఎట్లుంటే అట్లవుతుంది. కాని దీనిని విడువడమంటే ఏడుపు వస్తూన్నది, ఎంతమాత్రమూ మనస్సొప్పకుంది.

పిచ్చి - చూడు. ఆపక్షి ఒంటిగా పాడుతూ ఏలా గెగురుతున్నాదో.

              చింతా - అవగతమయ్యె నో - యమ్మ ! నీ బోధ,
                               పాడు మనసున కేది - పాలు పోదయ్యె !
                        తెలియ జెప్పిన నెంత - తెలుసుకో లేదు.
                               సన్యాసినివి నీకు - సద్భక్తి కుదిరె.
                        ఐహిక వాంఛలు - నమరియుండుటను
                               కనటు పోదయ్యె హృ - త్కమలమున నాకు.
                        బిల్వమంగళ క్షమా - విమలోదకమున
                               నగునేమొ మారన - మతిని యాచింతు,