పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 2] బిల్వమంగళ 87

నారు?

ఇన - విషమా ! విష మెక్కడిది?

1 జవా - ఆ మగవానివద్ద నుండెను.

ఇన - వాడు చచ్చెనా!

1 జవా - వాడే కాదు-అదీ చచ్చింది.

ఇన - వదరుబోతా? ఇద్ద రేలాగు చచ్చినారు?

1 జవా - మొదట మగవాడు విషము తిన్నాడు. నేను వాడిని శోధిస్తూంటే ఆడది కూడా విషము తిన్నది-ఇద్దరికీ ఊపిరి లేదు. శవములు స్టేషనులో నున్నవి.

ఇన - చూచితివా ? మానసింగ్, ఎంత ఘోరమో-(పోవుదురు.)

______

రెండో రంగము

______

(నడితోవలో చింతామణీ పిచ్చిది.)

చింతా - ఇక్కడ కొంతసేపు కూర్చుందాము. నేను నడువలేను, అలసినాను.

పిచ్చి - ఆలాగా? నేను కూర్చోలేను. అతడు నాకై యెదురు చూస్తుంటాడు. ఆలస్యమైతే ఏమంటాడో? నీవు నీ నాధునిచేర పొమ్ము. నేను నా నాధుని చేరపోవుదును.... ఇక నీ దారి నీది, నా దారి నాది. కృష్ణునికి పదహారువేల గోపికలు - నీవు నీకృష్ణుని కడక పో - నేను నాకృష్ణుని కడకు