పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 బిల్వమంగళ [అం 1

(సాధువు దాసియూ వత్తురు)

సాధు - ఇటు విను - ప్రేమానుబంధము పరిశీలించడములో నీవు మిన్నవు - నీహృదయ మెంత కోమలము! ప్రేమ అంటే సాధారణవిషయ మనుకొన్నావా? అది స్వర్గమంతా వ్యాపించి యున్నది, రాధాకృష్ణులు ప్రేయసులే సుమా!

దాసి - ప్రేమ ఎట్టిదో నాకు తెలియదు, నాకు నచ్చిన మగవాడు దొరకలేదు.

సాధు - నచ్చినవారని కొంద రుందురా? వెర్రిదానా, నీవు వాళ్ళ నట్లు కావించవలెను. పురుషులు భృంగముల వంటివారు, ఈవిషయ మతిరహస్యము సుమా...ప్రేమ బైట పడగూడదు. చూడు - రాధ మేనత్త, కృష్ణుడు మేనల్లుడు; ఐనా, వారి రాసలీల ఎంత గుహ్యము! ...నీ వేదో పనిమీద పోతూన్నట్లుంది...లేకుంటే ప్రేమనుగురించి ఇంకా ప్రసంగింతును. చెడుదారిలో పడ్డ నిన్ను మంచిదారిలోనికి తేవడమే నా ముఖ్యోద్దేశము.

దాసి - ఆలాగైతే సాయంత్ర మొకసారి దర్శన మిప్పించండి. నాకుకూడా మీ యుపదేశము వినా లనే వుంది. కడుపు జరుగక పోవడముచేతనే ఇట్లు నడుచుకుంటున్నాను అమ్మో! వీడెవడు?

సాధు - ఏడీ?

దాసి - నా యజమానురాలి దగ్గరికి పోయేటట్లున్నాడు. ఆమె ప్రాపకునికీ ఆమెకూ జగడము పెరిగి ఆతడు బైట