పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86 బిల్వమంగళ [అం 4

నికి వచ్చినాడు, నే నీయింటి దాసిని, నా కాపుర మిక్కడే, చింతామణి నా యజమానురాలు. బాబూ! దండాలు! నా ధనము, ప్రాణము, మానమూ మీచేతిలో నున్నవి. నాకు బేడీలు వెయ్యకండి-నేను చెప్పినదంతా నిజము.

ఇన - వీళ్లవద్ద తాళము చెవులున్న వేమో పరీక్ష చేయండి.

1 జవా - ఓరీ, నీకు మరణము తప్పదు-ఈనేరమునకు శిక్ష తప్పదు-న్యాయాధికారితో చెప్పుకొందువు పద.

సాధు - ఆలాగే! నడవండి-(వారి నిద్దరిని గొనిపోదురు)

ఇన - మానసింగ్, ఈపెట్టెను బైట కీడ్వాడాని కెంత మంది కావలనె? నీచేత నవుతుందా?

2 జవా - ఇం కిద్దరు కావలెను.

ఇన - మనవల్ల కాదన్నమాటే. ఇద్దరుంటే చాలునా!

2 జవా - ఇం కిద్దరుంటే మంచిది.

ఇన - దొంగ దొరకినాడు కదా? వీడికెంతో చిక్కి యుండదు. ధనమంతా ఈపెట్టెలో నుంటుంది-నీ విక్కడ జాగ్రత్తగా నుండు-నేను బయటికి పోయి రిపోర్టు వ్రాస్తాను.

2 జవా - అలాగే.

ఇన - నేను బైటికి పోతాను-రిపోర్టు నీవు తీసుకొని స్టేషనుకు వెళ్ళుదువు గాని.

[మొదటి జవాను వచ్చి]

1 జవా - మహాప్రభూ! కైదీలు విషము తిని చచ్చి