పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 5

వస్తాడని అనుకొంటున్నావు కాబోలు, ఇక రాడుసుమా" అని చెప్పిరా.

బిచ్చ - అలాగే - ఏ యిల్లు?

బిల్వ - అదిగో పెద్దయిల్లు, కనబడుతూన్నదా? అది సళాకులా గుంటుంది...ఏలాగున్న నేమి? నాకు నచ్చింది... ఈపాట వినిపించు.

బిచ్చ - ఏ మనవలెను? అతడు వస్తాడనా?

బిల్వ - కాదుకాదు. అత డిక రాడని...

బిచ్చ - తెలిసింది. నే నెరుగుదును - ఒక మహారాజు కోపమువచ్చినప్పుడెల్లా ఇట్లే కబు రంపేవాడు.

బిల్వ - నే నీమర్రిచెట్టుక్రింద ఉంటాను. అన్ని విషయములు సవిస్తరముగా తెలుసుకొనిరా, ఎక్క డున్నాదో, ఏమి చేస్తూన్నదో చూచిరా. జాగ్రత్త - పాటమాత్రము వ్రాసియివ్వకు.

బిచ్చ - అబ్బో! ఆలాగు చేస్తానా? నే నెరుగుదును.

బిల్వ - అదే చూడు - ఒక మగవానివెంట ఒక ఆడది వస్తూన్నది, అది విడిచివచ్చిన యిల్లే. ఆయింటిదాసి అది, ముందు దాని నడుగు, నాప్రసంగము వస్తే ఏమీ అనకు - నే నాచెట్టుక్రింద నుంటాను. (పోవును)

బిచ్చ - నాకు చేతకా దనుకొన్నారా? ఇష్టముంటే ఎట్టి కార్యమైనా చేయగలను (త్రోవలో నిలువబడును)