పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 బిల్వమంగళ [అం 1

బిచ్చ - (పాట ముగించి) పాట సరి, బాబూ! ఇప్పించరా?

బిల్వ - ఆగాగు! నేనుచూడనీ సరిగాఉందో లేదో.

బిచ్చ - చిత్తము.

బిల్వ - సందడిస్తూన్నదా?

బిచ్చ - బాబూ! రూపాయి యిప్పించరా?

బిల్వ - ఈపాట బాగులేదు.

బిచ్చ - ఏం బాబూ! ఆలా సెలవిస్తారు?

బిల్వ - ఓరీ, నీ వెప్పుడైనా వలపులో పడినావా?

బిచ్చ - అదేమో నాకు తెలియదు గాని, ఒకసారి జెయిల్లో పడ్డాను-నా ప్రారబ్ధ మది-అప్పటినుండీ కల్లూ గంజాయి రోజూ తాగడ మ్మానేశాను. ఎప్పుడేనా దొరకుతే పుచ్చుకొంటాను, లేకుంటే లేదు.

బిల్వ - నేను చెప్పినపని చేస్తావా?

బిచ్చ - బిచ్చ మెత్తుకోవాలి, పోతా నిప్పించండి.

బిల్వ - ఇస్తాను కాని, నేను చెప్పినట్లు చేస్తే ఇంకొక రూపాయి యిస్తాను...(స్వ) వీడి మూలాన దానిగుట్టు తెలుసుకోవలెను. దాని మనసులో ఆందోళనము పుట్టించవలెను..."అతడు వచ్చునని ఎంచుతూన్నావు కాబోలు - ఆయాశ సున్న సుమా!" అని కబురంపుతాను...ఓరీ, ఇటు విను-ఆయింటికి వెళ్ళు-చింతామణి అని ఒక ఆడ దగుపడు తుంది. అదేమి చేస్తున్నాదో చూచి దానితో "అతడు