పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 3

బిచ్చ - నిజమే? నా తోడే?

బిల్వ - ఇదిగో ఇంద. (ఇవ్వబోవును)

బిచ్చ - నన్ను పోలీసువాళ్ళ కప్పగించరు కదా?

బిల్వ - లేదులేదు, పాటచెప్పు.

బిచ్చ - దీనిని నేను దొంగలించలేదు, కృషిచేసి నేర్చుకొన్నాను.

బిల్వ - సరే, చెప్పు.

బిచ్చ - (పాడును)

బిల్వ - పాడవద్దు - మాటలు చెప్పు వ్రాసుకొంటాను.

బిచ్చ - వలపనెడి తుపానులోన...కల్లోలము.

బిల్వ - అబ్బో! వలపు మితిమీరందే! అలలు లేస్తూ పడుతూన్నవి - తరువాత?

బిచ్చ - ఏడ ప్రాణములు చేర్చునొ - ఎవ్వడెరుగు దైవ మాయ?

బిల్వ - ప్రేమ యెట్టి దనుకొన్నావు? నీ వెరుగుదువా?

బిచ్చ - (న్వ) ఈతనికి పిచ్చిపట్టింది కాబోలు?

బిల్వ - నీవు చెప్పలేవా? మెడ కురిపోసెదను సుమా! మాటాడవేమి? పాట చెప్పు...కానీ...

బిచ్చ _ సుడివడు పెనుసుడిలోబడి...

బిల్వ - ఉండుండు - సుడిగుండమా? మానుపండుగ నాటిదా?...