పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 55

పిచ్చి - నీవేనా నవనీతచోరుడవైన గోపాలుడవు? (నగచూపి) ఇవి నీకు కావలెనా?...వీటితో ఆడుకో హాయిగా! (కొన్నిచ్చును.)

బిచ్చ - ఇది సి-ఐ-డి లోది కాదు గదా?..ఎవరి కంటాపడలేదు-వీటితో నే నాశ్రమము నిర్మించుకో వచ్చును.

________

మూడో రంగము

________

(సోమగిరి శిష్యుడున్నూ వత్తురు)

సోమ - నేడే గోకులబృందావనానికి పోదాము.

శిష్యు - మీరు చూడదలచిన మహాపురుషు డేడి స్వామీ?

సోమ - నే నతని దర్శించినాను-నీవు చూడలేదా?

శిష్యు - నా కాభాగ్యమబ్బలేదు.

సోమ - బిల్వమంగళుని నీవు చూడనే లేదా?

శిష్యు - ఏమీ! ఒక లంపటుని చూడడానికా మీరింత దూరము వచ్చినారు! వేశ్యమూలాన నతడు విరాగి అయినాడు-ఈదశ ఎన్నా ళ్ళుండునో తెలియదు.

సోమ -

                     కాంతయుకనకము గన నొకమాయయె,
                                   ఇటునటు లీడ్చెడు నీ జీవంబుల;
                     విషమబంధముల-విడివడిజాలక