పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 బిల్వమంగళ [అం 3

న్నాను. నాకు పనిఉన్నది. సాయంత్రము తప్పక రా (పోవును)

(బిచ్చగాడు వచ్చును)

బిచ్చ - ఏమయింది?

సాధు - అవుట కేముంది? సాయంత్రము రావలెను.

బిచ్చ - ఏమన్నది?

సాధు - నీవుచెప్పినట్లు రొక్కము పట్టుకొని రమ్మంది.

బిచ్చ - సరిసరి-ఇక సాయంత్రము రావడ మెందుకు?

సాధు - ఇంకోసారి యత్నించి చూస్తాను.

బిచ్చ - ఆఁ. నాదగ్గర దాచుతూన్నావు, సరిగా చెప్పలేదు. నేను చూస్తున్నాను చాలాసేపు గుసగుసలాడి నారే?

సాధు - ఇంకేమీ లేదు, ముడిమా టంతే! నావెంట వస్తే నీకూ తెలిసియుండును. పోదాము రా.

బిచ్చ - తెలిసింది-ఏదో వంకపెట్టి నాకళ్ళలో దుమ్ము కొట్టవలెనని నీయుహ! నేను లేకపోవడము నీకు మంచిదేగా? సరే-నడువు, నావం తెగవేయడానికే ఈయె త్తెత్తినావు.

సాధు - నే నాలాటివాడిని కాను.. ఈ సాయంత్రము నీ కగుపడను-ఎక్కడికో ఎందుకో పోతాను... (పోవును)

బిచ్చ - మంచిది-వీనివెంట యుందును.

(పిచ్చిది వచ్చును)

పిచ్చిదాని కీనగ లెక్కడివి?..ఇవి చింతామణి నగలులా గున్నవి. తెలివిమాలిన దీనికి నగలెందుకో?