పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 2] బిల్వమంగళ 53

చింతామణి కుపదేశించకూడదా?

సాధు - ఉపదేశించగలను, కాని నీ కుపదేశించవలెనని నాకోర్కె.

దాసి - అదినేనెరుగుదును. చింతామణిని చేరపొమ్ము. ఈవేషముతో కాదు, పిచ్చివాని వేషము వెయ్యవలెను - నా యజమాని వృత్తాంతము నీవెరిగినదే-కావలసిన సన్నాహము సన్నాహము కావించెదను. ఆదాయములో ఎనిమిదోవాటా నీ వుంచుకో, తక్కినది నాది.

సాధు - నీమాటేకానీ-తరువాత నీకు ప్రేమ ఉపదేశిస్తాను. అప్పు డంతా నీదే!

దాసి - ఇం కేమైనా చెప్పవలసిం దుందా?

సాధు - లేదు.

దాసి - నీవార్జించిందంతా నాకిస్తావా?

సాధు - సొమ్మేనా? నాప్రాణాలే నీవి.

దాసి - నే నొకదగ్గర నుంటాను, నీ వింకోచోటుండు. నీ యింట్లోకుండలుతప్ప ఇంకేమీ ఉండరాదు, నీబట్టలపెట్టె నాయింట్లో నుండనీ; నీకూ నాకూ పొసగకుంటే కట్టుగుడ్డలతో నీవు బయటికి పోవలెను, నా వద్ద నీకు దాపరిక ముండరాదు.

సాధు - ఆలాగేకానీ.

దాసి - సాయంత్రము నీవువస్తే చింతామణిద్రవ్యము సేకరించే మార్గము చెపుతాను-చింకిగుడ్డలతో పిచ్చివాని లాగు రా- (లోపలనుండి "దాసీ" అనిపిలువు) ఇదిగో వస్తూ