పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52 బిల్వమంగళ [అం 3

అమ్మా, నీవు వెర్రితల్లివా?

పిచ్చి - అవును-నాకు జాల మవుతూంది-సెలవిమ్ము పోతాను.

చింతా - నీవు నాకూతురి నంటివే? ఉండు నానగలు నీకిస్తాను.

పిచ్చి - తే-నాకు నగలన్నీ పెట్టవూ?

చింతా - (ఇయ్య బోవును-పిచ్చిది పారిపోవును)

దాసి - పారిపోయింది!

చింతా - పోనిమ్ము-మన మింటికి పోదాము రా - (పోవును)

దాసి - ఈమెకుకూడా పిచ్చి పట్టినట్లుంది.

(సాధువు వచ్చును)

సాధు - దాసీమణీ!

దాసి - ఏమంటావు? నాకు తల నొస్తూన్నది.

సాధు - ప్రేమోదంతము వినడానికిది సమయమా?

దాసి - సొమ్ము తెస్తే సొద వింటాను.

సాధు - అది లేదు, శుద్ధ విష్ణుప్రేమయే-గళమందు వనమాల -

దాసి - ఆగాగు-(స్వ)వీడికి చిన్న పని కల్పిస్తాను. - నాయజమానురాలికి మతిపోయింది-కనబడ్డవారి కందరికీ కాసులిస్తూన్నది. వీడిమూలాన ఏమైనా రాబట్టెదను. సన్యాసులను చాలాసత్కరిస్తుంది. (ప్రకా) నీకృష్ణప్రేమను