పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 2] బిల్వమంగళ 47

రెండో రంగము

_______

(చింతామణి యింటిదగ్గర)

దాసి - అమ్మా, నీ వతని నిజముగా వలచినావు. ఆమాట నేనంటే "నన్ను తిట్టుతూన్నావు" అని అంటావు. అన్నము ముట్టవు, పాన మడుగవు. రేయుంబగ ళ్ళదే చింత! నేడు వెళ్ళినవాడు రేపు రాకుండునా? కోపగించి ఎక్కడికి పోగలడు? పదిరోజులు చూడు, పరుగెత్తి వచ్చును. లేకుంటే మరిపదిరోజులు-కాకుంటే ఒక నెల -

చింతా - ఆత డిక రాడే, నేను బాగా ఎరుగుదును. నాకంట పడక యిన్నా ళ్లున్నాడు! నన్ను వంచించినాడు. ఇది నిజము.

దాసి - పోనీ, నీవు క్రమక్రమముగా చిక్కిపోతూన్నావు, బెంగచేత కాబోలు? ఊళ్ళో నొకసంపన్నుడు నాకొరకెన్నోసార్లు వచ్చినాడట ! నే నాతని లెక్కచేయలేదు. అతడు రెండుమేడలను వ్రాసియిచ్చునట!

చింతా - అయ్యో ! నాకోస మాతడు సర్వమూ చెరచుకొన్నాడే! ఇప్పుడు దేశమును కూడా విడిచినా డేమో? ఆతని ఆత్మసంయమము నీ వే మెరుగుదువు?

దాసి - ఇంకా యిల్లుంది, వాకిలుంది. దేశమును త్యజిస్తాడా? పురుషుల స్వభావము నీవెరుగన ట్లుంది.

చింతా - కోపమే అయితే ఇంటివద్దనేనా ఉండును...