పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46 బిల్వమంగళ [అం 3

వామూర్తి ద్వయమును గాంచదలచుకుంటే వాటిని ధ్యానించు-ఆమర్మము గాంచగలవేమో చూడు.

బిల్వ - (ధ్యానించి) ఆహా! సత్యమే. ఇన్నాళ్ళూ నాకగుపడలేదు. ఆహా! ఏమి సుందరమూర్తియుగము ! ఈ బొమ్మలు తథ్యమేనా? రాధాకృష్ణులను మనము గాంచగలమా?

సోమ - దైవకృప లేకుంటే దర్శనము కాదు.

బిల్వ - కృష్ణు డెక్క డుండును?

సోమ - పిలిచి చూడు-అతడే చెప్పును.

బిల్వ - అయ్యా! మీ రెవరు? మృతప్రాయమైన నాహృదయమున ఆశాప్రసార మొదవజేసినారు. గురుదేవా! మీచరణదాసునిగా నన్ననుగ్రహించండి.

సోమ - అట్లనవద్దు. మీకు శ్రీకృష్ణు డాశ్రయ మిచ్చెను! రండి -నావాంఛాఫలసిద్ధి యొనర్చండి.

బిల్వ - మీరొకరు లభించినారు గనుక మిమ్ము విడువజాలను, మీయాన జవదాటను. దగ్ధమవుతూన్న నా హృదయమున ఆశాంకూరము నాటినారు. ఆ లత ఫలించడానికి మీకృపయే జీవనము, రండి పోదాము.. (పోవుదురు)

_______