పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 45

                        చూడనాహృదయంబు - శూన్యగేహంబు
                                  ఎవ్వడు నావాడొ - యిందు రావచ్చు,
                        తిమిరపూరము నాదు - దేహపంజరము
                                  ఉండజాలదు ప్రాణ - మురుభీతికలన
                        అయ్యయో! భంగంబు - నందె నాయాశ
                                  మరుభూమిమధ్యాన - మనియుండు నేను.
                        ఎవడను? నేనిట - కేలవచ్చితిని?
                                  ఛీ! ఏల నీయుదాసీనత గల్గె?
                        ఏది మేలొనగూర్చు - నీప్రాణములకు?
                                  ఏదియోప్రేమాబ్ధి - యెచటుండునదియొ?
                        కోరుచుందునుప్రేమ - కొమరొప్పజూప
                                  ధన్యాత్మ చెప్పవే - ధన్యుండనౌదు.

సోమ - అయ్యా? నీవు ధన్యుడవే. ప్రేమమయియైన రాధ నిన్ను ప్రేమపూర్ణునిగా చేసింది. నీకు భగవంతుని యెడ ప్రేమ కుదిరింది.

బిల్వ - అయ్యా! మిమ్ము గురువుగా భావిస్తాను. ప్రేమమయియైన రాధ యంటిరి, ఆమె యెక్కడ నుంది?

సోమ - నేను గురువునా? శ్రీకృష్ణు డొక్కడే అందరికీ గురువు. ఇంకొకరు కారు.

బిల్వ - రాధ ఎవతెయో చెప్పవా?

సోమ - రాధాకృష్ణమూర్తులు నా కగుపడుతూన్నవి. అవే చూడు...ప్రేమ ఎంత గబీరమో ఎవ్వ డెరుగును? నీ