పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడో అంకము

________

మొదటి రంగము - రాదారి.

(సోమగిరి బిల్వమంగళుడూ వత్తురు)

సోమ - నీవు విదేశీయునివలె కనిపిస్తూన్నావు, త్యాగివలె నున్నావు; నీ కాటంకము లేకుంటే నేటిరాత్రి నావెంట వచ్చి నున్న కృతార్థుని చేయుము.

బిల్వ - అయ్యా, నావా రెవరో చూపగలవా? పోనీ చెప్పగలవా? నా కెక్కడా అట్టివాళ్లు కనబడలేదు.

సోమ - నీవు ప్రేమోన్మాదివగు మహానుభావుడవు. ఇదే నమస్కారము.

బిల్వ - మీరెవరో నే నెరుగను-నే నొక హీన లంపటుడను. నాకు మీరు నమస్కరించరాదు. నేనే నమస్కరిస్తూన్నాను.