పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 39

నీవు రాక్షసివే, కాని కమనీయగాత్రపు, కాంచనమూర్తివి.

చింతా - దుంగపై ఈదినా నంటివే, ఏదీ దానిని చూపు.

బిల్వ - ఇంకా అపనమ్మకమే! రా, పోదాము.

________

మూడో రంగము

________

(నదీకూలము-శవము పడియుండును, బిల్వ, చింతా, దాసియూ వత్తురు.)

(బాటసారులు పాడుతూ పోవుదురు)

                       మాయరా-జన్మము-మాయరా-పరికించిచూడగ ||మా||
                       మాయరా కాంచనము దాపిన-కాయ మిది క్షణభంగురంబని
                       హేయమని-సర్వభోగంబుల-రోయుటే భద్రమని తెలియర||మా
                       కాలచక్రము నిల్వబోదుర - కాంచబోవు గతించు నిముసము
                       కాంతలను కనకంబువీడుము-కావు ముక్తికిసాధనములవి||మా||
                       సారము లేనట్టి సం-సారమనుచీకటిని నీకెట
                       దారితోచదు తెన్నుదోచదు-వారిజాక్షునిగొల్వకుండిన||మా||
                       వార కాంతల మోహవిభ్రమ-వాగురులలో చిక్కబోకుము
                       వారిహృదయముప్రేమశూన్యము-వారిమాటలుబూటకము లే||

బిల్వ - నిజము-సర్వమూ మాయ! ఈవిపులబ్రహ్మాండ మందు "నాది" అనదగిన దేదీ కానరాదు. ఎవర్తెకోసము నదిలో నర్ధరాత్రి ఉరికితినో అదే నాదికాదు! ఎక్కడైనా