పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36 బిల్వమంగళ [అం 2

రూపాయి యిమ్మంటే ఊరల్లా గోల! లేకుంటే మరిపింతలు. ఇల్లూ వాకిలీ తాకట్టు. నిచ్చెనవేసి గోడదాటి ఇంట్లో దూరడము! పైపెచ్చు మనస్సులో నాటే మాటలు!

బిల్వ - చింతామణీ-నిచ్చెనపై నే నెక్కలేదు, తాడు పట్టుకొనే ఎక్కినాను. నూరు రూపాయీలు జాగ్రత్తపెట్టు మని గుమస్తాతో చెప్పినాను, ఎల్లుండి యిస్తాను.

చింతా - ఏదీ, తాడు? చూపకుంటే చీపురు విరుగు తుంది.

బిల్వ - రా, చూపెదను.

చింతా - రా, దాసీ, చూచి వత్తాము. (పోవుదురు)

బిచ్చ - ఈనాడు నాగ్రస్థితి బాగులేదు, రాత్రి కూలి పోయింది, నిద్రే లాభము-నన్ను వీళ్లు సాక్ష్యము వేయలేదు, బతికినాను, న్యాయాధిపతే విచారణకర్త! ఆమెమాట నిజమే, ఈరాత్రివేళ నది దాటడ మేమిటి! అంతా గోల లాగుంది - ప్రేమ యిలాటిదే కాబోలు ! దూరాన ఉండి అంతా చూస్తాను.

_______

రెండో రంగము

_______

(గోడమీద పాము-బిల్వమంగళ, చింతామణి, దాసి, బిచ్చగాడు.)

బిల్వ - అదిగో చూడు, తాడు వేలాడుతూన్నది.

చింతా - ఏదీ? (గోడదగ్గరకు పోయి) అమ్మో!