పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 35

దాసి - ఇంకా ఉన్నావా? ఒకసారి చెప్పితే వినబడ లేదా?

సాధు - రే పొకసారి కంటపడుతావా?

దాసి - ఇప్పుడు దయచేయండి, రేపటిమాట ఆలోచింతాము. (సాధు పోవును)

బిచ్చ - ఏమమ్మో, యజమానురాలా, నేనుకూడా పోనా? నాకేమి యివ్వవా?

చింతా - ఆఁ కొంచెముండు - ఏమి తల ఆడిస్తూన్నావు? అతనివెంటా రాలేదు, నన్నుచూడ వచ్చినానంటున్నావా; ఈజీవచ్ఛవ మెందుకు వచ్చినాడు? - ఇంత గాలి వానలో ఏ రీదడ మేమి? శ్రాద్ధమూ లేదూ గీర్థమూ, లేదు. సర్వాబద్ధమే ! ఏటియొడ్డునే ఎక్కడీ దాగియుండెను - గోడ దాటడమేమి? గచ్చుగోడ నున్నగా ఉంది, దన్నూ లేదు దావూలేదు.

(బిల్వమంగళుడు వచ్చును)

బిల్వ - చింతామణీ, నీవు తాడు జారవిడువ లేదా?

చింతా - విన్నావా? దాసీ, ఎవరికోసమో గోడమీది నుండి తాడు జారవిడిచినా నట? చూచినావా గేలి?

బిల్వ - హాస్యము కాదు, నీతోడు - నిజముగానే తాడు పట్టుకొని ఎక్కినాను.

చింతా - దాసీ, నీవు నాకన్న పెద్దదానవు - నీయెదుటనే చెప్పుతూన్నాను, ఇట్టిమాట లింక పడలేను. ఒక