పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 33

రావమ్మా! దీపము తేవమ్మా! ఏదో మూల్గుతూన్నట్లుంది.

(దీపము పట్టుకొని చింతామణి వచ్చును)

చింతా - ఏమిటే? ఏ మాగోల?

దాసి - (బిల్వ|| చూపి) చూడమ్మా-అయ్యగారు!

చింతా - మాడుముఖము మళ్ళీ వచ్చిందా? ఇక నన్ను కొరుక్కొని తింటాడు-అదేమి మూలుగుతున్నాడు?

దాసి - గోడమీదనుండి గెంతినారు, దెబ్బ తగిలింది, ఇరుకు పట్టిందేమో?

చింతా - నామెడ కురిపోసినాడు-నాకేమి దిక్కు దేవుడా?

బిల్వ - చింతామణీ-నీరు కొంచెము తే.

దాసి - బ్రతికియున్నా రమ్మా, భయము లేదు. జీవముంది.

చింతా - లేకుంటే నాప్రాణాలు తీయడ మేలాగా?

దాసి - ఇటురా, చేతులుపట్టుకొని తీసుకొని పోదాము.

చింతా - ముందు లేవనెత్తి కూర్చోపెట్టు.

బిల్వ - దాసీ, నీవు నన్ను ముట్టకు, చింతామణీ! కౌగిలిచ్చి నన్నెత్తు.

చింతా - ఆఁ. దాసీ, ఎత్తవే-లే లెమ్ము, నేను రావాలా?

దాసి - అయ్యా! నీకు బుద్ధి ఉందా?