పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 21

గుమా - బ్రాహ్మణులు భోజనము చేస్తున్నారు, కుంభవృష్టి కురుస్తున్నది - రామా, ఇక్క డెందుకున్నావు?

బిల్వ - వాని కిట పనిఉంది - నీవు లోనికిపోయి సమారాధన చూడు.

గుమా - సమారాధన వర్షముచేత నాగింది.

బిల్వ - సరే - నాకు నూరురూపాయీలు కావలెను, ఏలాగైనా జాగ్రత్తపెట్టు - తెలిసిందా?

గుమా - సొమ్మేదీ? ఇల్లు తాకట్టు పెట్టవలెను.

బిల్వ - ఏలాగైనా సరే.

గుమా - నేను లోనికి పోతాను. కొంచె మాగండి.

బిల్వ - త్వరలో సొమ్ము జాగ్రత్తపెట్టు - లేకుంటే ఫలమనుభవిస్తావు సుమా!

గుమా - ఆలాగే - ఇక నీకొలువునకు నీళ్ళొదులుకోవలెను.

బిల్వ - ఏమి వాన! బయటపడకుంటే పడవ దొరకదు - ఎంత ఖర్చైనా అద్దరి చేరవలెను - (పోవును)

రాము - ఇదిగో తాళముచెవి. ఇక్కడే ఉంది. మతి లే దీయనకు. నాకు జీతమురాళ్ళు ముట్టనే లేదు. సాధ్యమైనంత చేజిక్కించుకొనవలెను. విసిరినమ్మకి బొక్కిందే కూలి.