పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 2] బిల్వమంగళ 17

సాధు - నావద్దనుంటే నీకు భయము లేదు. అంతర్ధానవిద్యచేత నిన్ను దాచగలను.

బిచ్చ - అందుకే మీరదృష్టవంతు లన్నాను. పోలీసు వాళ్ళ కళ్ళు సూక్ష్మగ్రాహ్యములు. నీట్లో దాగుకొన్నా జాడదీసి అవి దొంగని బైట కీడ్వగలవు.

సాధు - నాదగ్గర నుంటే నీకు భయ మనవసరము.

బిచ్చ - సరే - ఈ వినోద మెన్నాళ్ళో! ఇందు దొనగేమి?...అయ్యా, మీరు మాటలాడుతారా, లేక మౌనముద్ర వహిస్తారా?

సాధు - యోగ్యులతోమాత్రమే మాటలాడడము.

బిచ్చ - జ్ఞానపత్రి సేవిస్తారా?

సాధు - అప్పుడప్పుడు మోతాదుగా.

బిచ్చ - మీ కష్టాంగసిద్ధి యైందా ?

సాధు - అది పరమరహస్యము.

బిచ్చ - వచ్చినవా ళ్లందరినీ యాచింతురా, లేక యిచ్చవచ్చిన వాళ్ళనే అడుగుదురా?

సాధు - హోమకుండము ముందుంటుంది - ఇష్టమున్న వా ళ్లేమైనా ఇచ్చెదరు.

బిచ్చ - సరే - మీ యాశ్రమ మెక్కడ ?

సాధు - గుడిగాని గుండముకానీ చూసుకోవలెను.

బిచ్చ - సరే - వంతులు పంపక మేలాగు ?

సాధు - నాకు కుటుంబ ముంది, వాళ్ళకి నెలకి పది