పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16 బిల్వమంగళ [అం 1

దాగున్నా నన్ను బయటికీడ్చినారు!

సాధు - నాగురువుగారి కృపవల్ల యోగశాస్త్రము, ధర్మశాస్త్రమూ, చికిత్సాశాస్త్రమూ మొదలయినవాటి నభ్యసించినాను. ఎప్పుడూ జగత్‌క్షేమంకరములైన కార్యములే చేస్తూందును, నిన్ను శిష్యునిగా నొనర్చుకోవలెనని ఉన్నది; నీవు త్యాగివలె నున్నావు. నీచరిత మెట్టిదో వినవలెనని ఉంది, చెప్పుము.

బిచ్చ - మీ రపరాధపరిశోధకులు గారని నాకు నమ్మకము ఇప్పటికి చిక్కింది. అందరి తలవ్రాతా ఒకతీరున నుండదు. నేను చిన్నప్పుడు మత్తువస్తువులు సేవించి యిల్లు గుల్లచేసి తుదకు కడుపుజరుగక బంగారుపూత పూసిన గిన్నె దొంగిలించి దానివల్ల ఒకమాసము హాయిగా గడిపినాను. నేను కాశికిపోయి ఒకపూజారి తలపై నున్న బంగారు వస్తువు దొంగిలించినాను.

సాధు - సరిపోయింది. నాకు తగిన శిష్యుడవే!

బిచ్చ - మీదయవల్ల ఎట్టి పనైనా పట్టుబట్టి సాధించగలను, కాని ఒక చిక్కుంది. నేనెక్కడ కనబడితే అక్కడ పట్టుకొమ్మని గవర్నమెంటువారి హుకు ముంది.

సాధు - దానికొక ఉపాయ ముంది; జడలు ధరించి ఎర్రశారీలు గట్టి ఒళ్ళంతా విభూతి పూసుకుంటేసరి.

బిచ్చ - ఆవేషముతోనే నేను దొంగిలించినది. అందుచేత జడలు కత్తిరించవలసి వచ్చింది.