పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 2] బిల్వమంగళ 15

రెండో రంగము

_________

(బిచ్చగాడు, సాధువు)

బిచ్చ - సరేకాని ముం దీమాట చెప్పండి, మీ రపరాధపరిశోధకులు కారుకదా?

సాధు - శివశివా! ఎంతమాట ! నాపూర్వోత్తరము విను - నేను మొదట నవాబుకొలువులో నుంటిని, నాపేరు రామకుమారుడు. ఇది కలికాలము కదా ! అధర్మభీతి గలవాని కాపదలు మెండు. నేను కొంతధనము దొంగిలించినానని నాపై దావా తెచ్చినవెంటనే నాకు వైరాగ్య ముదయించి కాశికి పోగా, అక్కడ నాపూర్వభవపుణ్యవిశేషము వల్ల నాకొక గురువు లభించెను - అతడు సిద్ధుడు - పండ్రెండేండ్లు నన్ను తన సుతునివలె చూస్తూ నా కుపదేశించెను.

బిచ్చ - సొత్తు దొంగిలించినందుకు పోలీసువాళ్ళు పట్టుకోలేదా?

సాధు - శివశివా ! నేనేమి ? దొంగలాడడమేమి! ఎవరో కిట్టనివా ళ్ళీకింవదంతి పుట్టించినారు.

బిచ్చ - అయితే పోలీసువాళ్ళు మిమ్మేమీ చేయలేదూ?

సాధు - "యతో ధర్మ స్తతో జయ:", దైవకృపవల్ల ప్రమాద మేమీ ఘటిల్ల లేదు.

బిచ్చ - మీ రదృష్టవంతులు! నేను మరుగుదొడ్డిలో