పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14 బిల్వమంగళ [అం 1

వేయుదునా?

బిల్వ - అంతదానవు కనుకనే చెప్పుతున్నాను. (పోయివచ్చి) చూడు - చిలక, గోరింకపిల్లలకు కందిగింజ శనగ గింజ మేతపెట్టు (పోయివచ్చి) నీళ్ళిమ్మా, లేకుంటే గొంతు కార్చుకొని పోతుంది.

చింతా - మేతా నీళ్లూ పెట్టవలెనేమి! గొంతుక పిసిగి గోతిలో పెట్టెదను, లేదా మెడనులిమి మింట నెగుర గొట్టెదను.

బిల్వ - అబ్బో! నీ వంతదానవే! కనుకనే చెప్పుతూన్నాను. అవి మాటలాడితే ఆడనీ.

చింతా - చాదస్తపు బాపడా, ఇంటికి పో - శ్రాద్ధము పెట్టవలె నంటివే! తిండెప్పుడు తింటావు ? ప్రొద్దెక్కింది పోవయ్యా.

బిల్వ - ఇదిగో పోతున్నాను. (తిరిగీవచ్చి) చెప్పమరచి నాను, లేడిపిల్లకు గడ్డివేసి, కొమ్ము కర్రకి కొట్టుకోకుండా కట్టు, జొరావరిచేస్తే కోపగించకు, నేనుపోయివస్తాను.

చింతా - అనడమే కాని ఆచరణము లేదే! నాకు స్నానానికి వేళయింది. రేపుదయము వత్తువా?

బిల్వ - చూదాము లే...

_________