పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 13

మాటా ఇది? పనిపాటు లుండవా?

చింతా - అదంతా నాకు తెలియదు, రేపు రాకుంటే ఒట్టు వేస్తున్నాను - నన్ను చంపుకొన్నట్టే.

బిల్వ - ఆలాగే వస్తానులే.

చింతా - వస్తానులే కాదు, రేపు మధ్యాహ్నము సరికి నీ విక్కడికి రాకుంటే మీయింటికి నేనే వస్తాను.

బిల్వ - తప్పకుండా వస్తానని చెప్పడ మేలాగు?... (పోవును)

బిచ్చ - అయ్యా, బావనయ్యా, నాకిస్తానన్న దేదీ? (పోవును)

దాసి - కోపము తగ్గిందని తెలిసీ ఇంటి కెందుకు తీసుకొని పోలేదూ?

చింతా - తండ్రిశ్రాద్ధము పెట్టుకోవద్దా! ఇంటికి కొనిపోతే ఏలాగు? ... ఈరాత్రికి వీనిపీడ వదలింది...అబ్బబ్బా... నాకు కైదే కదా? కొంగు వదలడే, ఎటూ కదలనీయడు... రాత్రి అంతా గుసగుసలే! తలాలేదు తోకాలేదు...నిన్ను వలచినాను, నిన్ను వలచినాను, అని ఒకటే రోకలిపాట! వలచి నన్ను కొన్నాడా?...అదిగో చూడు, మళ్ళీ వస్తున్నాడు ! (బిల్వమంగళుడు వచ్చును.]

బిల్వ - ఈరాత్రి నేను రాను, నా బట్టలు జాగ్రత్త సుమా!

చింతా - విన్నావా దాసీ, బట్టలు వీధిలో పార