పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8 బిల్వమంగళ [అం 1

దాసి - ఓరి చచ్చినోడా! నాతో విగటమా?

బిచ్చ - కాదు - ఒకమాట చెప్పవలెను - ఇంటికి పద చెప్పుతాను.

దాసి - చెప్పవా? మా అయ్యగారు నీకంటపడ్డారా?

బిచ్చ - పడితే పడ్డారు, లేకుంటే లేదు - ఇంటికి పద. అక్కడ చూసుకుందాము. కనబడిన వాళ్లందరితో చెప్పు మందువా?

దాసి - (చింతామణినిచూచి) ఆతని వెదకాలనే కాబోలు - అదిగో - నా యజమానురాలు ఒకగడియ తాళలేకుంది. ఇల్లు వెడలి వచ్చింది - నేను మరచిపోయినా ననుకొన్నది - కాబోలు.

బిచ్చ - అదే కాబోలు చింతామణి! ఇది తనయజమానురా లంటున్నది, లోపలిమాట బయటికి రాకుండా కొంచె మాగుతాను.

(చింతామణి వచ్చును)

దాసి - ఏమమ్మా, కొంచెము శాంతించకూడదా? ఓపికలేదా ? ఇల్లు విడచి ఇప్పుడే రావలెనా? చూచేవాళ్లేమందురు?

చింతా - అనుకోనీ, నే నోర్వలేను. స్నానానికి పోతూన్నాను.

దాసి - ఏడీ, ఆతడెక్కడా కనబడడే! గొప్పింటివాడు కదా? నీవు కొద్ది చేతలు చేస్తే సంహించునా?