పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 4] బిల్వమంగళ 101

ఆమహాత్ముడు మనవెంట వస్తాడా ? మనయింట నుండుమంటేనే ఆతడు సమ్మతించలేదు. దగ్గరే ఉన్నా మనకు దర్శన మబ్బ లేదు... ఈ గోపాలు డెవడో?...నందబాలుడే కాడు గదా! భీక రారణ్య మధ్యమున చీకును కాచుకొని యున్నాడట ! భక్తవత్సలుడైన పరమేశ్వరుడే కాబోలు?

అహ - కోరకుండానే బంధువున్నూ, కనకుండానే కొడుకూ నాకు లంభించారు, నేను గొడ్డువీగినాను. ఈయిద్దరినీ వెంటబెట్టుకొని బృందావనము పోదాము.

వర్త - వాళ్ళు మనవెంటా వస్తారా అని సంశయిస్తూన్నాను.

అహ - తప్పకుండా వస్తారు..ఆ బాలుడు సామాన్య గోపబాలకుడు కాదు. సాక్షాత్తుగ నందనందనుడే! అన్నమాట తప్పుతాడా?

వర్త - సరే-ఇం కాలస్య మెందుకు? ఇప్పుడే పోదాము.

________

నాల్గో రంగము

________

బిల్వ - హకృష్ణా! కృష్ణా! ఎక్క డున్నావు? నాకగుపడవా? నీ వంతర్యామివి కావా? నాప్రాణ మతి వ్యాకుల మైంది. ఇప్పుడైనా దర్శన మివ్వవా?...దీనదయాళూ ! అనాధ నాధా! ఎక్కడున్నావు? కృష్ణా! కృష్ణా! (పడిపోవును)

గోపా - (బిల్వ||చెవిలో) కృష్ణ, కృష్ణ, కృష్ణ!