పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 99

రానిస్తే అదేమిటో చెప్పుతాను, మీతో బృందావనము రానిస్తారా.

వర్త - ఎందుకు?

గోపా - అతనికి కళ్ళులేవు. "హాకృష్ణా, కృష్ణా" అని అరుస్తూ గుండెలు బాదుకొంటాడు, నేను చూడలేకున్నాను. దేనిలో పడతాడో అని ఎప్పుడూ కాచుకొనే ఉంటాను. కబోది-కూడే ముట్టడు. నేను బలవంతపెట్టితే కాస్తతింటాడు.

వర్త - ఆ మహ్మాత్ముడే!

అహ - ఔనౌను - బోధపడ్డది-

వర్త - అత డేడీ?

గోపా - అడవిలో నున్నాడు.

వర్త - ఏమి చేస్తూండును?

గోపా - ఎప్పుడూ కృష్ణనామస్మరణే. కృష్ణా, కృష్ణా! అని అరుస్తాడు! కృష్ణుడు ఇతని తాతముత్తాతలనాటి సేవకుడనుకొన్నాడు కాబోలు?

వర్త - (నవ్వి) ఇంకా ఏమి చేస్తూండును?

గోప - జపమూ, సాష్టాంగ నమస్కారాలు. ఒకప్పుడు నేల నెత్తి కొట్టుకొంటాడు...మీవెంటా అతన్ని తీసుకొని పోతారా?

వర్త - ఆతడు వస్తాడా?

గోపా - నే నొప్పించి తీసుకొస్తాను. బృందావనము తీసుకొనిపోతే అక్కడ కృష్ణుడు దొరకుతాడు-