పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 7

వెడలి నాడు.

సాధు - సరే - నేను సాయంకాలము వస్తాను - ఇంట నింకెవ్వరినీ ఉండనీయకు - తలుపు మూడుసార్లు మెల్లగా తట్టుతాను. ఊరు మంచిదికాదు, ఎవరి కంటనైనా మనము పడితే ప్రమాదము.

దాసి - ఆలాగే - మరచిపోక వస్తారు కదా! (అతడు పోవును)

(బిచ్చగాడు వచ్చును)

బిచ్చ - నేను మీయింటి కే వస్తూన్నాను.

దాసి - నీ వెవడవు?

బిచ్చ - ఇప్పుడు చెప్పను - త్వరగా ఇంటికి పద.

దాసి - చావు - ముండకొడకా! నీ మొగాన నిప్పు పెట!

బిచ్చ - నాకే కాదు, నాపితాళ్లకందరికీ అలా అయింది. నేను నీవలలోపడను, ముందు నీవుపద, వెనుక నేనుంటాను.

దాసి _ ఓరి నీయిల్లు కూల! నీకు పిచ్చి పట్టిందా?

బిచ్చ - జాలము చేయకు, మాట చెప్పవలెను - ఆతడు చెట్టు క్రింద నున్నాడు.

దాసి _ ఎవరు, మా అయ్యగారేనా? చెప్పు చెప్పు - ఎక్కడున్నారు?

బిచ్చ - ఉఁ ? ఇక్కడ చెప్పుతా ననుకొన్నావా ? ఇంటికి పద.