పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరెన్నోవిషయాలు పొరపాటుగా పేర్కొన్నారు. క్రమానుగతంగా వాటి నన్నిటిని చర్చించుదాము.

షష్ఠ్యంతాలు ఉన్న కావ్యం ప్రతిదీ అంకితం యివ్వబడిందేననీ కృతిసమర్పణవిషయకంగానే షష్ఠ్యంతాలు వేయబడినవనీ, ఒక దురభిప్రాయం దేశంలో పాతుకుపోయింది. ఇది కేవలం భ్రమాపూరితమైన భావం. ఈ భ్రమకారణంగానే నన్నెచోడుని కుమారసంభవంలో షష్ఠ్యంతాలున్నవి కాబట్టి ఆ కావ్యం మల్లికార్జునునికి అంకితమిచ్చాడనే భావం యేర్పడింది. కృతి సమర్పణ సందర్భంగానైనా షష్ఠ్యంతాలు వ్రాశాడా అన్న విషయ మాలోచించిన వారేలేరు. తన గురుదేవుడైన మల్లికార్జునుని కేవల శ్రోతగానే గ్రహించి కుమారసంభవరచనకు నన్నెచోడుడు దొరకొన్నాడే గాని, తన కావ్యాన్ని అంకితమివ్వలేదు. [1]తాను అంకిత మిస్తున్నట్లు ఏ పద్యంలోనూ చెప్పలేదు. పైగా

గురువున కిష్ట దైవమునకుం
        బతికిం గృతి చెప్పి పుణ్యమున్
వరమును దేజముం బడయ
        వచ్చు జగంబుల నిశ్చయంబు మ
ద్గురువును నిష్టదైవమును
       గూర్చు నిజేశుడు దాన నాకుఁగా
కొరునకు నిట్లు సేకురునె
       యొక్కట లాభము లెన్నియన్నియన్.

(కు. ప్ర. అ. 50. ప.)

అని స్పష్టంగా 'కృతి చెప్పి' అని వాడి తన కావ్యాన్ని మల్లికార్జునునికి వినిపిస్తూ చెప్పినట్లే భావించాడు.

మల్లికార్జునునికి కథానాయకుడైన ఈశ్వరునికి అభేదం చాటినందువల్ల మల్లికార్ఝునుని ఎక్కడ పేర్కొన్నా, కథానాయకుడుగానే పేర్కొన్నాడుగాని కృతినాయకుడుగా పేర్కొనలేదు. నన్నెచోడుడు స్వవిషయం, కృతివిషయం మొదలైనవి చెప్పగా పోతన రచనలో ఒక పద్యానికి మార్గదర్శకమైన "రవికులశేఖరుండు కవిరాజశిఖామణి" అన్న పద్యంలో (కు. ప్ర. ఆ. 57ప) కూడా "సత్కథాధిపతి భవ్యుడు జంగమ మల్లికార్జునుండు" అని కథాధిపతిగానే పేర్కొన్నాడు గాని కృతి

  1. నన్నెచోడుడు కుమార సంభవాన్ని మల్లికార్జునునికి సతిగా అంకిత మివ్వలేదనీ అతనిపేర సంతానంగా వెలయించాడనీ "సప్తసంతానాలలో కృతి సతియా? సుతయా?" అన్న బృహద్ వ్యాసంలో నిరూపించాను. (కృష్ణాపత్రిక 1961, ఆగష్టు, సెప్టెంబరు.)