పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నాక్రమించంగలదు? ఇంద్రజాలం బెఱింగిన నరుండు గరిపించిన
యుగ్రపన్నగంబు లతని భయంబు నొందింపంగలవే? ఇట్లు సర్వ
కామప్రదుండై భవాబ్ధితరణియైన విష్ణువును ద్వేషింపుచు నాత్మ
ద్రోహులై యవివేకులు ఖగంబులు పక్వవనంబులు విడిచి తిరిగి
నట్లు చరింపుదురు. సత్కార్యంబైన నసత్కార్యంబైన ప్రభుప్రేరణ
చేతనే కావించి విచిత్రకర్మానుగతబుద్ధినంధులై యస్వతంత్రులై
యేమేమి గావింపరు? గురునియెడ క్షోభకరంబైన వాక్యంబు నాకుఁ
బలుకుట యుక్తంబుగాదు. న న్ననుగ్రహింపుమని మ్రొక్కి యేమి
యైన నేఁ జేసిన యది నే ననుభవించెదనని యూరకయున్న దైత్యుండు
నన్నిదిక్కులు నీక్షించి మాయాభేదంబున నిట్లనియె.

122


సీ.

ఎంత మూఢుఁడు [1]వీఁడు; నీక్షింతిరె వీనిఁ
                       బోషించిన ఫలంబు? బుద్ధి దప్పెఁ;
బ్రతికూలములు నాకుఁ బల్కెడు; వీనివా
                       క్యంబులయందు సారంబు గలదె?
అన్నియుఁ బరికింప నౌర యోరి దురాత్మ
                       భాషించెదవు మూఢఫణితి నిట్లు;
నాకంటె మంత్రిరత్నంబులకంటె యు
                       క్తిని గుశలుండవే! తనయ! నేఁడు?


తే. గీ.

ముదిసి రోగవిశీర్ణాంగములఁ గృశించు
వాఁడు పల్కినఁ దగుఁగాక వయసు గలిగి
రాజపుత్రుండవై నవ్యరమణు లుండి
యూర్వశికిఁ గ్లీబుఁడునుబోలె నునికిఁ దోచె.

123


క.

మందాత్మ! నీవు ధార్మికు
చందంబునఁ బల్కెదవు మృషావచనంబుల్
[2]నిందించెదు నేఁ బరమా
నందంబునఁ బల్క దైత్యనాయకు లుల్కన్.

124


వ.

కాంతాకేలిరసోజ్జ్వలంబులైన విషయంబు లనుభవింపు; మాయువు
వృధ చేయకుము; సాభిలాషదృష్టులై మదించిన ముదితలతో

  1. వీని నీక్షించి
  2. నిందించెడు నే పరమా