పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సేయ స్మరాదులు తృషిత[1]సురభిని హ్రదంబు చేరకయుండ మూర్ఖులు
వారించినయట్లు వారించు; నీరిపుపక్షంబు విడిచెద. తండ్రీ!
ఎయ్యది యాత్మీయబలం బని పలుకంబడియె నది విష్ణుబలం;
బావిష్ణుండె సకలాత్మభూతుండు; తదన్యసేవ పరసంశ్రయము;
శత్రుల విడిచెద; పరుల భజింప; నీశ్వరబలంబే నాబలంబు;
తత్ప్రతిజ్ఞ యుష్మత్ప్రసాదంబున సత్యం బగుగాత. శ్రీహరి నామ
రూపంబు లేనివాఁడని దోషయుక్తంబుగాఁ బలికిన నేమి? యదియును
గుణవంతంబె యగు; స్వసనామరూపశాలి యగు నతం డెట్లు సేవింపం
దగు? ననామరూపత్వవిముక్తికొఱకు ననామరూపంబై యవికృతం
బైన తేజంబు సేవింపందగు. కార్పణ్యంబు విడుచుటకుఁ గార్పణ్యంబు
గలవాని సేవింపందగదు. కార్పణ్యంబు లేని ధన[2]వంతు సేవింపం
దగదు. అస్థూలంబై యహ్రస్వంబై యనణువై యదీర్ఘమై యనామ
రూపంబైన యనంతవస్తు వెయ్యది యది భవభీరువు లైనవారిచేత
సేవింపందగు; నదియ బ్రహ్మంబును, విష్ణువును; ఆతేజంబునేఁ
గోరుదు; నతిగుహ్యంబై పరమయోగియోగ్యంబై పరతత్వనిష్ఠం
జెందిన యీకథ యిట్లుండ నీనోరికిం దగని కబళంబు గ్రహింవ
శక్యంబై అనామరూపుం డైనను పుణ్యసహస్రనామంబు లందని లీలా
ధృతశ్రీమదనంతశక్తిం దనరి, దుష్టాంతకుండై, శిష్టజనేష్టదాతయైన,
హరి సేవింపందగు. హరిసహస్రనామంబులయందు నొకటి దలఁచిన
నొకటి కీర్తించినఁ దత్ఫలం బింత యంత యనినవారిని దేవతలు
నిందింతురు. పరబ్రహ్మంబైన యీవిష్ణువు హుతాశనరూపంబునేని
వైష్ణవరూపంబునేని భిన్నోపదేశులైన మునులు స్మరించి, యమృత
త్వంబు నొందుదురు, కొంద ఱాయీశ్వరుని రూపంబులు విధిక్రమం
బున సేవించి స్మరించి కాలమృత్యువు దరింపుదురు; స్థావరజంగ
మంబులై పృథగ్విధంబులైన నామరూపంబులన్నియు నావిష్ణు
రూపంబులే; ప్రపంచరూపుండైన విరాట్పురుషుండు నతండె; యిది
విస్మయకరంబే; [3]ఫణులు దైత్యులు చెనకలేక యుండుట విష్ణుని
మాయ; యతనిచేతనే కల్పితంబై(నయది) యతనిశక్తి నెట్లు

  1. సురభి నిర్హ్రాదంబు చేరకయుండు
  2. వంతుండు
  3. ఫణంబులు