పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/662

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

హరి పరాత్మ యాత్మ నధివసింపక యున్న
జనుల బాధ[1]పెట్టు సంతతంబు
నుగ్రతాపరాక్షసగ్రహరోగంబు
లరయ నేమి సేయు నతనికరుణ.

113


క.

పరమపరాపరుఁ డగు నీ
శ్వరు [2]నతని జగన్మయుం బ్రసన్నజ్ఞాన
స్పురణమున నెఱుఁగునాతం
డరయఁగ సర్వాధికుఁడు కృతార్థుఁడు ధరలో.

114


క.

ఆయల్పవీరదైత్యని
కాయము ప్రహ్లాదు [3]నెదురఁ గదలింపంగాఁ
జేయవు నిజపదభజనో
పాయంబున మేరునగముఁ బరుసమువోలెన్.

115


వ.

అంత నాతనితేజంబు విని సంతాపంబు నొంది కొంతతడవు
చింతించి స్ఫురద్గరళంబులైన యురగంబులం బిలిచి యవిరళం బగు
గరళంబున దైత్యకులద్రోహియగు వీని నాతనయుండని చూడక
హింసింపుఁ డని నియోగించిన.

116


క.

అనివార్యరోషభీషణ
ఘనతరమరుదశనతీవ్రగరళోద్భటసూ
తనదంష్ట్రాగ్నిని ఫణిసూ
దనకేతనభక్తిరతుఁడు తలఁకక నిలిచెన్.

117


వ.

మఱియు నయ్యురగంబులు గరచి విదళించి యమునాహ్రదంబునం
గృష్ణునిం జుట్టుకొనిన కాళియాహియుంబోలె హరిప్రేషితగరుడశత
విదళితంబులై నెత్తురులు గ్రక్కుచు స్రుక్కుచు గోఱలు విఱిగి
ఫణంబు లొరగి యొడలు చిఱిఁగి భోగంబులు వగుల నాదైత్యపతిం
గాంచి దేవా! భవదాత్మజు నిట్టట్టు సేయ శక్తులము గాము. నీ వింత
ఘనునిం గన్నవాఁడవు. మున్ను విషదృష్టం జూచిన సముద్రంబు
లింకు నద్రులు భసితంబులౌ నిది యేమి వింతయో! బాహ్యంబున
మృణాళమృదులం [4]బయ్యు నంతరంగం[5]బున దంభోళిధారాకఠోరం

  1. లిట్టి
  2. నతని
  3. నెదురఁ
  4. బగు
  5. బగు