పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వాదశనామకుడైన ఏకైకసూర్యుడు కాడని తేటతెల్ల మవుతున్నది. కాగా "దశదిశో నానా సూర్యాః" అన్న వేదవాక్యంలో ఒక భాగంగానే ఈ ద్వాదశాదిత్యులు నారదీయపురాణోక్తంగా విరాజిల్లారని పరమవైజ్ఞానికంగా ఆమోదించవలసి ఉంటుంది.

ఆర్షవిజ్ఞానం దృష్ట్యానేకాక ఆధునికవిజ్ఞానందృష్ట్యా కూడా ఖగోళంలో తోకచుక్కలు, అనేకరకాలైనవి ఉన్నవి. వాటిల్లో రకరకాలశక్తు లున్నవి కూడా వున్నాయి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కతోకచుక్క పొడిస్తే యెవరో వొకమహాపురుషుడో, మహాత్ముడో, గొప్పపరిపాలకుడో అంతరిస్తాడని లోకంలో వాడుక వున్నది. నరసింహకవి కల్యాణతీర్థమహిమను గురించి వర్ణిస్తూ దుర్భిక్షాన్నిసైతం కలిగించి లోకాన్ని సంక్షోభపరిచే తోకచుక్క వుంటుందని యీ క్రిందిపద్యం ద్వారా తెలియజేశాడు.

"అశ్మవర్షవిపాభిహతసమస్త
సస్యసంపత్సమృద్దియై జగతియందుఁ
బొడమె దుర్భిక్ష మొకయేఁడు పూర్ణమగుచు
ధూమకేతువు చిందులు ద్రొక్కఁదొణఁగె."

(నార. 115. పు. 105. ప.)

కాగా వివిధ అరిష్టాలకు మూలకాలైన విభిన్నధూమకేతువు లున్నాయని పరమవైజ్ఞానికంగా మన మామోదించక తప్పదు.

వివిధమన్వంతరాలలో సప్తఋషులు విభిన్నులుగా వున్నట్లు శాస్త్రీయంగానూ, ఆర్షవాఙ్మయం దృష్ట్యానూ, పౌరాణికంగా సైతం మనకు తెలుస్తున్నది. స్వాయంభువమన్వంతరంలో మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు అనే మహర్షులు - స్వారోచిషమన్వంతరంలో ఔర్య, వసిష్ఠపుత్ర, స్తంబ, కశ్యప, పాణ, బృహస్పతి, దత్త, చ్యవనాత్రులు అనే మహర్షులు - ఉత్తమమన్వంతరంలో గురు వాసిష్ఠులు, ఊర్జులును, హిరణ్యగర్బులు అనే మహర్షులు - తామసమన్వంతరంలో పృథుడు, కావ్యుడు, అగ్ని, జహ్నుడు, ధాత, కపీవంసుడు, అకపీవంసుడు అనే మహర్షులు - రైవతమన్వంతరంలో యదుధ్రుడు, వేదశిరుడు, హిరణ్యరోముఁడు, పర్జన్యుడు, ఊర్ద్వబాహుడు, సత్యనేత్రుడు, దేవబాహుడు అనే మహర్షులు - చాక్షుషమన్వంతరంలో భృగుడు, నభుడు, వివస్వంతుడు, సుధాముడు, విరజుడు, అతినాముడు, నహిష్ణుడు, అనే మహర్షులు - వైవస్వతమన్వంతరంలో వసిష్ఠ, అత్రి, గౌతమ, కశ్యప, భరద్వాజ, జమదగ్ని, విశ్వామిత్రా దులయిన మహర్షులు - సూర్యసావర్ణికమన్వంతరంలో గౌతమ, అజర, శరద్వంత,