పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వార, సుషేణ, సురిచి, ఘృతాచి, గౌతమ నామకులైన పరివారంతో విలసిల్లుతాడు. ఫాల్గుణమాసంలో సూర్యుడు "క్రతు" నామకుడై వర్యస, భరద్వాజ, సేనజిత్, విశ్వ, ఐరావత, నామ్నులైన పరివారంతో ప్రకృష్టు డవుతాడు. ఈవిధంగా చైత్రాదిగా ఫాల్గుణాంతంగా ఉన్న ద్వాదశమాసాలలోనూ ఏకైకసూర్యుడే ద్వాదశభిన్ననామాలతో ద్వాదశాదిత్యులుగా పరిగణించబడతాడని పేర్కొన్నారు. మరికొందరు తుర్యమ, క్రతువులకు ధాతలకు మారుగా అంశుమంత, పర్జన్య, అజులను గ్రహించారు. మరికొందరు అర్కశబ్దాన్ని సైతం గ్రహించారు. వేదవిజ్ఞానానికి భిన్నంగా మనకు కనిపిస్తున్న ఏకైకసూర్యుణ్ణే చైత్రాది వివిధమాసాలలో ద్వాదశాదిత్యులుగా పరిగణించారు. కాని నరసింహకవి రుక్మాంగదచరిత్రలో అతని రాజ్యకాలంలో అతనితోపాటు ప్రజలందరూకూడ రాజాజ్ఞానువర్తులై ఏకాదశీవ్రతనిష్ఠులై కేవలం పరమపదాన్నే చేరుకుంటున్నారని అటు స్వర్గానికికాని ఇటు యమలోకానికిగాని ఎవ్వరూ రావడంలేదని యమధర్మరాజు బ్రహ్మతో మొరపెట్టుకుంటాడు. ఈసందర్భంలో తనకు యమధర్మరాజపదవే అక్కరలేదని వక్కాణిస్తూ "ఈ నియోగంబు నే నొల్ల, యజ్ఞ తీర్థ దాన యోగ సంయోగంబుల నిటువంటి సద్గతిలేదు. ధాత్రీఫలానులిప్తులై వాంఛ లుడిగి, రసభోజనోద్భవవాంఛలు విడిచి విభ్రష్టకర్ములేని హరిలోకంబు గాంచిరి. గళరజ్జుబంధనంబుల మద్దూతలు దెచ్చినవారల హరిదూతలు శిక్షించికొని చనిరి. ద్వాదశాదిత్యతీవ్రతాపదుర్గమంబైన మన్మార్గంబు భగ్నం బయ్యె నేమి విన్నవింతు నింక" (నార. 201-పు. 60. వ) అని అంటాడు. ఈసందర్భంలో పేర్కొనబడిన ద్వాదశాదిత్యులు ఇతరపురాణాలవలె ఏకైకాదిత్య విభిన్నచైత్రాది మాసగత విశిష్టనామకులు కారు. యమధర్మరాజుమార్గం ద్వాదశాదిత్య తీవ్రతాపదుర్గమ మయినదట. అంటే ద్వాదశాదిత్యులు విభిన్నంగా ఉన్నారనీ ఒకేసారిగా అ పన్నెండుసూర్యుల తీవ్రతాపం ప్రసరించేమార్గం యమధర్మరాజుమార్గమనీ అర్థమవుతున్నది. చైత్రాదిమాసాలలో విభిన్ననామాలతో విరాజిల్లే ఏకైకసూర్యుని తాపం ఏకమాసాత్మకంగా ప్రసరించడానికి వీలున్నది గాని ద్వాదశమాసాలతో సంకలితమైన పరిపూర్ణతాపం ఒకేసారి యమలోకమార్గంమీద ప్రసరించడానికి వీలులేదని స్పష్టపడుతున్నది. ద్వాదశాదిత్యుల తీవ్రతాపం ఒకేసారిగా ప్రసరిస్తున్న దన్నాడంటే నారదీయపురాణకర్త దృష్టిలో ద్వాదశాదిత్యులు మాసాత్ములుగాకాక విభిన్నసౌరమండలాలకు చెందినవారని విదిత మవుతున్నది. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా ద్వాదశాదిత్యులుగా పేర్కొనబడినవారు విభిన్న సౌరమండలాలలో ఉన్న ప్రత్యేకసూర్యులే నని చైత్రాది ఫాల్గుణాంతంవరకూ ద్వాదశమాసాలలోనూ ఉన్న మాసాత్ముకుడై