పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయోగించడం ద్వారా భూమండలాన్ని స్ఫురణకు తెచ్చినా "దక్షిణోత్తరభేదంబున నాకు రెండాశ్రమంబులు గలవు. సర్వోత్తరంబులు; ఆధిక్యంబున నదియే సర్వోత్తరగిరి యగు. గుణత్రయభేదంబున నరులకుం బ్రకృతి భిన్నంబైన నారాయణాద్రి నిష్ఠులకు రజస్తమోగుణంబులు లేవు వినుండు" (నార. 82. పు. 472. వ). అని ఖగోళగతమైన సర్వోత్తరగిరిని, వైకుంఠాద్యచ్యుతస్థాన లోకసారమైన యదుశైలాన్ని వర్ణించాడు. బ్రహ్మ మోహినికి కర్తవ్యాన్ని ఉపదేశించినసందర్భంలో నరసింహకవి మందరగిరి ఉనికినిగురించి, మందరగిరి కైవారంగురించి, తన్మందరగిరిమీద వున్న దివ్యశివలింగం గురించి సూక్ష్మదృష్టితో వర్ణించాడు. మందరగిరి భూమిమీద వున్నదని మనం సామాన్యంగా అనుకుంటాం. కాని అది ఖగోళంలో అత్యున్నతస్థానంలోవున్న క్షీరమహాసముద్రనామకాలైన (Thick Milky Way) నక్షత్రాలగుంపుమధ్యలో వున్నదని నరసింహకవి వేదఖగోళాన్ని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా పేర్కొన్నాడు. మందరగిరిగురించి, దానికైవారం గురించి, దానిమీద వున్న దివ్యశివలింగాన్ని గురించి నరసింహకవి యీ క్రింది విధంగా వర్ణించాడు.

"ప్రబలసురాసురప్రవరుల కెడలింప
          నలవిగాని నగేంద్ర మరయ నెద్ది?
హరికి వ్యామగ్రాహ్యమై భుజాంగదసము
          త్కాషసారంబైన గ్రావ మెద్ది?
పుక్కిటి జంటిగాఁ ఖూర దుగ్ధాంభోధి
          నోలలాడెడు మహాశైల మెద్ది?
భూతజాలావృతపురమర్దనైకవి
          హారసౌధంబైన యచల మెద్ది?
దివిజులకు రచ్చ, తాపసప్రవరులకుఁ ద
పంబు పంట, సురాధిపభామలకు ర
తి ప్రవర్తన వశ్యాధిదేవత, వివి
దౌషధంబుల కాకరం బట్టి శిఖరి.

అయుతము వేయు యోజనము లగ్గిరిమూలము దానియంతయే
నియతముగా వెడల్పును వినిర్మలకాంచనరత్నశృంగముల్.

సప్తయోజన విశ్రుత శక్రనీల
కలిత తచ్ఛిల దివ్యలింగంబు మెఱయు