పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరాహ జామదగ్న్య శ్రీ నరసింహ రఘువల్లభ శ్రీధర వామన హయగ్రీవ వాసుదేవ లోకంబులు గలవు. తవధిపతులు విభవేశ్వరులు నిత్యులు. వీరు వ్యూహాష్టవిశిష్ట శ్రీ వైకుంఠేశ్వరప్రీతి సాధనంబైన బ్రహ్మవిద్య నర్వాచీనప్రాకృతభూముల నవతరించి ప్రకాశింపఁజేయుదు రీమూర్తులం గొల్చిన నపవర్గంబు లభించు. తృతీయావరణంబున నెనిమిదిదిక్కుల పాంచజన్య ముసల చక్ర ఖడ్గ గదా శార్జ్గాది వైజయంతంబులు నిలుచు. నిత్యానవధికనిరతిశయానందంబగు భగవత్సేవ గావించు. చతుర్థావరణంబునఁ గుముద కుముదాక్ష పుండరీక వావన శంఖకర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠితులు నిత్యులు. నిత్యముక్తులతో నీశ్వరు నారాధింపుదురు. పంచమావరణంబున నింద్రానలదండధరనిరృతియాదసాంపతిగంధవాహధనేశానులు నిత్యనిర్జరు లుండుదురు. ఇది యావరణపంచకంబు. (నార. 358, 359-పుట. 171వ.) అని వివిధలోకాలను వివరించి అనంతరం "తృతీయావరణబహిర్దేశంబున విష్వక్సేనులోకంబు గలదు." (నార. 360. పు. 176 వ.) అని తృతీయావరణలో విష్వక్సేనులోకం ఉన్నట్లు పేర్కొన్నాడు. వేద ఖగోళశాస్త్రాల దృష్ట్యా ఆర్షవిజ్ఞానం దృష్ట్యా ఆధునికఖగోళవిజ్ఞానం దృష్ట్యా కూడా శేషశాయి అయిన శ్రీ మహావిష్ణు నక్షత్రాలను దృష్టిలో పెట్టుకొని ఆయా వివిధలోకాలగురించి ఆధునికవైజ్ఞానికులు పరిశోధనలు కొనసాగించవలసి ఉన్నది.

ఖగోళవిశేషాలు

నరసింహకవి వివిధసందర్భాలలో అనేక వేద ఖగోళశాస్త్రాది విశేషాలను తెలియచేశాడు. ధ్రువుని చరిత్రను వర్ణించే సందర్భంగా "యవికృతనిజరూపుండ వగుట నీకు వివిధభావము మాయచే విరుద్ధంబు గాదు. దినకర కరజాల మూషరస్థానసంగంబున నవికృతమేనియు నిజరూపవికారంబు వహించునట్లు నీ రూపంబు వైకృతంబును గారణంబునన వినంబడియె. ఆ వైకృతరూపము జగత్తిని వేదంబులు పలికె. కారణంబగునవి బ్రహ్మమును, సత్తునని విన్నవించు నట్టి దేవవంద్యంబులైన యీ రెండు రూపంబులు భజించెద. విశ్వమూర్తి! నిన్ను వేదంబులు దశశతముఖునింగా, సహస్రాక్షిపాదునింగా బలికె. మఱియును సహస్రముఖ పాదాక్షిబాహూరునింగాఁ బలికె. వితతునింగా నణువుంగాను దీర్ఘునింగాను పలికె. బ్రహ్మభూతుండవై వితతవిమలరూపుఁడవైన నీయందు నివిశ్రుతము వేఱైయున్న యదియుంబోలెఁ జూడంబడి స్వాశ్రయాభిన్నంబయ్యె. జలమయంబగు ఫేనంబు గాన్పించి లయకాలంబున వేఱుగాని యట్లు వివిధరూపంబు లన్నియు నిన్నుంగలయు." (నార. 450, 451 పు. 29. వ) అని పురుషసూక్తవిషయాలను సంగ్రహపరిచాడు. నారాయణగిరిమహత్వవర్ణనాసందర్భంలో "అది దక్షిణదేశంబున" ఇత్యాది పదాలను