పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందులో చార్వాక, బౌద్ద, జైనాది మతాలను నరసింహకవి తనకు పూర్వకాలంలో అవతరించి వ్యాప్తిచెందిన వాటి నన్నిటిని పేర్కొన్నాడు. నారదుడు మునులకు చెప్పినట్లు సూతమహర్షి శౌనకాదులకు చెప్పిన పద్ధతి చూస్తే, శాండిల్యమహర్షితోపాటు వివిధపాషండమతాలన్నీ నారదమహర్షికి పూర్వకాలంలోనే వున్నట్లు మనం భావించవలసి వస్తుంది. నరసింహకవి తన రచనను కొనసాగించేటప్పుడు, సరైన ఆలోచనాక్రమం లేకుండా, పూర్వాపరకాలవిచక్షణ లేకుండా భూతార్థకక్రియలు ప్రయోగించడంవల్ల లేనిపోని తికమకలు తెచ్చిపెట్టాడు. ఇదేవిధంగా ఏకాదశీమాహాత్మ్యవర్ణన సందర్భంలో

"సరణిఁ గానరు యోగంబు సాంఖ్యయోగ
మనఁగ విన రెన్నఁడేని స్వాధ్యాయమైన
హవనకృత్యంబుఁ జేయరు దివిరి వారు
హరిపదముఁ గాంచి రిట్ల యత్యద్భుతంబు."

(నార. 201. పు. 59. ప.))

అని ఆధునిక మతమైన సాంఖ్యయోగప్రసక్తి తెచ్చి "కాంచిరి" అని భూతార్థకక్రియను సైతం ప్రయోగించాడు.

సుచరితునకు కల్యాణతీర్థమహిమను గంగానది చెప్పిన సందర్భంలో నరసింహకవి భూమండలంమీద ద్రవిడదేశాన్ని దారిద్ర్యవారణుడనే రాజు పరిపాలిస్తున్నట్లు "భూతలమునందు ద్రవిడదేశం బేలు దారిద్ర్యవారణుండను రాజు వేఁడిన యంతకంటెఁ దెలివితో నిచ్చుననుచు బోధింప" (నార. 115. పు. 107. ప.) అని తద్దర్మర్థకమైన 'ఇచ్చు' ధాతుప్రయోగంతో పద్యం రచించినా అనంతరవిషయాన్ని బట్టి దారిద్ర్యవారణుడు సుచరితుని సమకాలికుడైనట్లు వీరు నారదమహర్షికి పూర్వులైనట్లు మన కవగతమవుతుంది. అయితే కృతయుగానికి పూర్వంనుంచీ కూడా ద్రావిడదేశం, ద్రావిడజాతి వున్నదన్న అభిప్రాయం స్పష్టమవుతున్నది. పూర్వదేవత లనబడిన రాక్షసులు, మొట్టమొదట దేవతలుగానే వుండి, శాపవశానో, కర్మవశానో రాక్షసులుగా ఆవిర్భవించినప్పటినుంచీ 'విద్రావణ'శబ్దంమీద ఆధారపడి విధ్వస్థకారకులుగా 'వి' నిలుప్తమై 'ద్రావణ' శబ్దం 'ద్రావడ' 'ద్రావిడలు'గా మారి అతిప్రాచీనకాలంలోనే పరిణామం చెందినట్లు కనిపిస్తున్నది.

నరసింహకవి చతుర్వేదికి భాగవతానుగ్రహంతో బ్రహ్మరాక్షసత్వం తొలగినవిధాన్ని వర్ణించిన సందర్భంలో "గృధ్రరూపులైయున్న భార్యాపుత్రులును