పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అద్దురాత్ములు పలికిన ట్లపుడె నమ్మి
యందుఁబడి యాసురాత్ములై యఖిలజనులు
వైదికాచారవిముఖులై వైష్ణవులును
విష్ణుదేవుని నిందించి విమతులైరి."

(నార. 377. పుట, 244, 245, 246.ప)

ఇత్యాది సందర్భాలలో భూతకాలక్రియలను ఉపయోగించడం ద్వారా పురాణప్రామాణికతను, ప్రాచీనతను ఆధునికయుగానికి తీసుకొనివచ్చి, అసలు పురాణాలు భవిష్యద్వాణిగా ప్రోక్తా లయ్యాయనే అభిప్రాయానికి గొడ్డలిపెట్టుగా ప్రాచీనాధునాతనకాలచరిత్రజ్ఞానవిరహితత్వంవల్ల స్వవచనవ్యాఘాతంగా రచన కొనసాగించాడు. అనేకానేకాలైన ఆధునికమతాలను పేర్కొనడంద్వారా చివరికి "జైమినియందు జైనవీరులయందు మొదలు సత్పురుషులకు విశ్వాసంబు పుట్టింపుచున్నవాఁడై యతివాదంబుచేతం గర్మైకప్రాధాన్యాదికంబును సూచించె."

(నార. 406. పు. 51. వ.)

అమరగురు బుద్ధకణ భుగర్హజ్జినేంద్ర
గౌతమాదులు సాధులోకద్విషద్బ్ర
మంబు గావింప బాహ్యశాస్త్రంబులెల్ల
మేరమీఱఁగఁ గొన్ని నిర్మించి రంత"

(నార. 441. పు. 216. ప.)

అని బుద్ధమతాలన్నే కాక, జైనవీరమతాన్నిసైతం పేర్కొనడంద్వారా నారదీయపురాణప్రాచీనత్వాన్ని అర్వాచీనం చేసి అప్రామాణికం చేశాడు. చివరికి హిరణ్యకశిపుని వర్ణించిన సందర్భంలోసైతం "ఆజ్ఞాసిద్ద శ్రౌతహింస జైనుండుఁ బోలె దూషింపుచు." (నార. 433. పు. 176. వ) అని హిరణ్యకశిపుని జైనమతస్థునితో పోల్చి నరసింహకవి తన పూర్వాపరకాల అనభిజ్ఞతను నిరూపించుకున్నాడు. నరసింహకవి తృతీయాశ్వాసంలో పాషండమతభేదాల గురించి చెపుతూ భవిష్యద్వాణిగా కాణాద, శాక్త్య, పాషండ, జైనాది మతాలు భవిష్యత్తులో తలయెత్తుతాయని యీ క్రిందివిధంగా పేర్కొన్నాడు. "అనిన (నతఁడు వారికి) నిట్లనియె. కాణాద శాక్త్య పాషండ జైన ప్రముఖులు నరకాంగారవర్ధనులై విజ్ఞానం బొకానొకప్పుడు చెఱచి దేహవ్యతిరిక్తంబైన యాత్మలేదు. కేవలమును దేహమె యాత్మ యనుట యర్హంబని తెలియంబడుచున్నది గాన దేహాను