పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భవిష్యద్వర్తమానకాలాదిక్రియలను ప్రయోగించినట్లు కనపడదు. నారదీయపురాణాన్ని చదివితే ప్రహ్లాదుడు సంజనితుడవ్వడానికి పూర్వమే ప్రహ్లాదాదిచరిత్రలు నారదుడు చెప్పినట్లు అర్థమవుతుంది. కాని కొన్నిసందర్భాలలో భూతభవిషద్వాచకాలైన క్రియలను ఉపయోగించడంలో నరసింహకవి తికమకలు పడినట్లు స్పష్టంగా విదిత మౌతున్నది. విష్ణుచిత్తుడు ప్రహ్లాదునికంటె పూర్వుడు. విష్ణుచిత్తునికథావర్ణనాసందర్భంలో నరసింహకవి యీ క్రింది పద్యం రచించాడు.

"విష్ణుచిత్తా! నినుం జూడ వేడ్క గలిగి
యరుగుదెంచితిఁ బ్రహ్లాదుఁ డండ్రు నన్ను
నీమహత్వంబు విని విని నీరజాక్ష
భక్తినిష్టాపరత్వ మేర్పడఁగఁ గంటి."

(నార. 168. పు. 105. ప.)

ఆతరువాత విష్ణుచిత్తునికి విష్ణువు ప్రత్యక్షమైన విషయాన్ని వర్ణించి "కాంచి మ్రొక్కి నుతించి బ్రహ్మాదిలోకంబులు నిరసించిన యమ్మహానుభావుండు సద్యోముక్తుం డయ్యెనని చెప్పిన, ఋషులు విని నారదున కిట్లనిరి." (నార. 169. పు.112. వ.) అని నరసింహకవి వ్రాయడంద్వారా - ప్రత్యేకించి "సద్యోముక్తుం డయ్యె" అన్న భూతకాలక్రియను ప్రయోగించి నారదుడు చెప్పినట్లుగానే వ్రాయడంద్వారా ప్రహ్లాదాదిచరిత్రలు జరిగిన అనంతరమే నారదుడు ఋషుల కీకథను చెప్పినట్లు ద్యోతకమవుతున్నది. రత్నావళి వృత్తాంతవర్ణనాసందర్భంగా ఒకరాక్షసుడు కాశీపతిపుత్రియైన రత్నావళిని హరించిన సందర్భంలో నరసింహకవి "దశాననుండు సీతంబోలె హరించి, మొఱలిడ నంకంబున నిడికొని" (నార.288. పు. 118. వ) అని సీతను రావణాసురు డపహరించినవిషయంతో పోల్చి నరసింహావతారానికి పూర్వమే వ్రాయబడిన నారదీయపురాణం రామాయణంతరువాత రచింపబడిందన్న అభిప్రాయం కలిగేట్లుగా నరసింహకవి పూర్వపరదృష్టిలేకుండా రచించాడు. పరబ్రహ్మరహస్యార్థంగురించి వివరించే సందర్భంలో నరసింహకవి "ప్రథితేతిహాసపురాణోపబృంహితోపనిషన్మతము పరబ్రహ్మపరమధామాక్షరాదిపదవిశిష్టసంజ్ఞక మాగమేతరదూర మనఘతరము" (నార. 342. పు.105. ప) అని భారతేతిహాసాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసినట్లు కనిపిస్తున్నది. ఇదేవిధంగా మోహిని, రాజు ధర్మాంగదుణ్ని చంపాలని కోరేసందర్భంలో "పురందరునకుఁ గర్ణుండు చర్మం జొప్పింపఁడె?" (నార. 302. పు. 168. వ.) అని ధర్మాంగదుని కథ భారతగాథానంతరం జరిగినట్లుగా పొరపాటున పేర్కొనబడింది. ఇదేవిధంగా నరసింహకవి మోక్షోపాయతహితాన్ని వివరించే సందర్భంగా