పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మమితపురాణరహస్యతంత్రము వేద
         మాదిత్యపురుషజన్మములు జగము
లట్లైన వాఙ్మయంబంతయు నీపురా
         ణంబులయందె ధన్యతవహించె
నట్లుగానఁ బురాణార్థ మధికతరము
తెలియ వేదార్థమునకంటె వెలయుననుచు
సుప్రతిష్ఠము జేసిరి సూటిగాఁ బు
రాణములయందు వేదతంత్రంబులెల్ల."

(నార. 275. పు. 53 ప.)

అయితే కొన్నిసందర్భాలలో ఉపనిషత్తులకు తరువాత - పురాణాలమాట చెప్పలేము కాని - ఉపపురాణాలు అవతరించాయన్న భావంతో నరసింహకవి అనేకసందర్భాలలో ఉపనిషద్వాక్యాలను ఉదాహరించాడు. ఆత్మదేహాదుల విషయమై వివరించే సందర్భంగా "క్షతం ప్రధాన మమృతాక్షరమ్మ" నియెడి యుపనిషద్వాక్యంబు గలదు............. 'ఏకోదేవ సర్వభూతేషు' అనియెడి యుపనిషద్వాక్యంబు గలదు.................... 'సపర్యగాచ్ఛుక్రమకాయ మప్రణమ్మ'ను ఉపనిషద్వాక్యంబు గలదు.... 'నిత్యోనిత్యానామ్‌' అనియెడి యుపనిషద్వాక్యంబు గలదు." (నార. 325. పు. 29. వ) అని అనేక ఉపనిషద్వాక్యాలను ప్రామాణికాలుగా ఉదాహరించాడు. ఇదేవిధంగా వేదాంతరహస్యంగురించి వివరించేసందర్భంలో సైతం విప్రుడనేవాడు అంగాలతో సహా ఉపనిషత్పూర్వకాలుగా వేదాలు చదవాలని యీక్రిందిపద్యంలో స్పష్టంగా పేర్కొన్నాడు.

"సాంగోపనిషత్పూర్వక
ముంగా వేదములు చదవి మురజిత్సేవా
సంగంబులేని విప్రుఁడు
వెంగలి తజ్జన్మ మెల్ల విఫలం బెంచన్."

(నార. 335. పు: 68. ప)

వాస్తవం పరిశీలిస్తే పురాణగాథలు కాని, ఉపపురాణగాథలు కాని సూత్రప్రాయంగా ఏకైకసూత్రబద్ధాలేనని పూర్వాపరకాలవ్యత్యాసాలకు అవకాశం కల్పించేవి కావనీ, కల్పాలపరంగా కాని, యుగాలపరంగా కాని మనం ఆమోదించవలసివుంటుంది. కాని దేశభాషలలోకి పురాణోపపురాణాలను అనువదించేటప్పుడు అనువాదకులు యీపూర్వాపరకాలవ్యత్యాసాలను దృష్టిలో పెట్టుకొని భూత